Bridegroom slams Groom after refuses to eat Sweet: ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు సందడి చేస్తుంటాయి. ఇందులో మనుషులు, జంతువులకు సంబందించిన వీడియోలు కొన్ని మాత్రమే జనాలకు నచ్చడంతో విపరీతంగా వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యపరిస్తే, మరికొన్ని విపరీతమైన నవ్వును తెప్పిస్తాయి. ఇంకొన్ని మాత్రం అందరికీ షాక్ ఇస్తుంటాయి. ఇలాంటి కోవకే చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో వివాహం అనంతరం రిసెప్షన్‌లో వధూవరులు చితకొట్టుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. వివాహం అనంతరం రిసెప్షన్‌ జరుగుతోంది. వరుడు తన కుటుంబ సభ్యులతో వేదికపైకి చేరుకుంటాడు. కాసేపటి తర్వాత వధువు కూడా తన కుటుంబ సభ్యులతో వేదికపైకి వస్తుంది. జయమాల సమయంలో వరుడికి వధువు ముందుగా స్వీట్లు తినిపిస్తుంది. వరుడు చాలా ప్రేమతో ఆ స్వీట్లు తింటాడు. ఆపై వరుడు స్వీట్ పెట్టగా.. వధువు తినడానికి నిరాకరిస్తుంది. అయినా వదలని వరుడు ఆమెకు బలవంతంగా స్వీట్లు తినిపించే ప్రయత్నం చేస్తాడు. 


వధువు స్వీట్ తినకుండా వరుడుని పక్కకు నెట్టేస్తోంది. దాంతో కోపోద్రిక్తుడైన వరుడు వధువును చెంపదెబ్బ కొడతాడు. వధువు సైతం  కోపంతో ఒఊగిపోయి వరుడిని కొడుతుంది. కుటుంబ సభ్యులు ఆపినా వధువు వెనక్కి తగ్గదు. వరుడితో గొడవ పడుతుంది. ఇద్దరూ కాపేపు వేదికపైనే కొట్టుకుంటారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. 


Also Read: Eoin Morgan Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌!


Also Read: Arjun Tendulkar: చొక్కా లేకుండా.. మహిళా క్రికెటర్‌తో సచిన్ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్! 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.