Arjun Tendulkar: చొక్కా లేకుండా.. మహిళా క్రికెటర్‌తో సచిన్ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్!

Arjun Tendulkar Lunch date with England cricketer Danielle Wyatt. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జన్‌ టెండూల్కర్‌ పేరు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Jun 28, 2022, 08:04 PM IST
  • మహిళా క్రికెటర్‌తో అర్జున్ టెండూల్కర్‌
  • చొక్కా లేకుండా అర్జున్
  • వైరలవుతున్న ఫొటోలు
Arjun Tendulkar: చొక్కా లేకుండా.. మహిళా క్రికెటర్‌తో సచిన్ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్!

Arjun Tendulkar going Lunch date with England cricketer Danielle Wyatt: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు, ముంబై ఇండియన్స్‌ ఆటగాడు అర్జన్‌ టెండూల్కర్‌ పేరు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్‌ డేనియల్ వ్యాట్‌తో అర్జున్ చొక్కా లేకుండా ఉండడమే ఇందుకు కారణం. ప్రస్తుతం లండన్‌లో ఉన్న అర్జున్.. వ్యాట్‌తో కలిసి సోహో నగరంలోని ఓ రెస్టారెంట్‌లో లంచ్‌కు వెళ్లాడు. ఇందుకు సంబందించిన పోటోలను వ్యాట్‌ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు. అవి కాస్త వైరల్ అయ్యాయి. 

అర్జున్ టెండూల్కర్, డేనియల్ వ్యాట్‌ లంచ్‌కు వెళ్లిన సమయంలో ఇద్దరూ కెమెరాలకు ఫోజులిచ్చారు. కొన్ని ఫోటోలలో అర్జున్ చొక్కా లేకుండా ఉన్నాడు. ఈ ఫొటోలపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. 'డానియల్ వ్యాట్.. బుట్టలో అర్జున్ పడ్డాడా' అని ఒకరు కామెంట్ చేయగా.. 'జంట బాగుంది' అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇంకొందరు మాత్రం వారి బంధాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని ట్వీట్ చేస్తున్నారు. మొత్తానికి వ్యాట్‌, అర్జున్ పేర్లు మరోసారి నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. 

అర్జున్ టెండూల్కర్, డేనియల్ వ్యాట్‌ ఇలా బయట కనిపించడం ఇదే మొదటిసారి కాదు. ఇదివరకు కూడా ఇద్దరు కలిసి క్రికెట్ ఆడడమే కాకుండా బయటికి కూడా వెళ్లారు. వ్యాట్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుంటుంబంతో మంచి సాన్నిహిత్యం ఉంది. సచిన్, అర్జున్ ఇంగ్లండ్ వచ్చిన ప్రతీసారి ఆమె వారిని కలుస్తుంటుంది. లార్డ్ క్రికెట్ మైదానంలో సచిన్, అర్జున్‌ను తొలిసారి వ్యాట్‌ కలిసింది. 2009 తెలిసారి కలిసినప్పుడు అర్జున్ వయసు 10 ఏళ్లు. 

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు అర్జున్ టెండూల్కర్ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2021, 2022లో ముంబై జట్టులో ఉన్నా ఒక్క మ్యాచ్ కూడా అతడు ఆడలేదు. రెండు సీజన్లలో అర్జున్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. 2022లో ముంబై పేలవ ప్రదర్శన కారణంగా అర్జున్‌కు అవకాశం దక్కుతుందని అంతా భావించినా అది జరగలేదు. రంజీ ట్రోఫీలోనూ ముంబై జట్టు నుంచి అర్జున్ ఉద్వాసనకు గురయ్యాడు. దాంతో అతడి కెరీర్ సగదిగ్ధంలో పడింది.   

Also Read: Eoin Morgan Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌!

Also Read: Varinder Singh Dead: భారత హాకీ దిగ్గజం కన్నుమూత!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News