Cadbury Dairy Milk Bajji Making Video: ఇప్పుడు ఏ విషయంలో అయినా అందరూ వెరైటీ కోరుకుంటున్నారు, రొటీన్ గా చేసే పనులు జనానికి ఏ మాత్రం నచ్చడం లేదు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో ప్రేక్షకులకు కనిపిస్తున్నాయి. అలాగే తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వైరలైన వీడియోలో ఒక యువతి ఒక తోపుడు బండి మీద బజ్జీలు వేస్తూ కనిపిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే అవి ఏ పచ్చి మిర్చి బజ్జీలో, లేక ఎగ్ బజ్జీలో అనుకోకండి అవి క్యాడ్బరీ డైరీ మిల్క్ బజ్జీలు. ఇలా డైరీ మిల్క్ తో కూడా బజ్జీలు వేస్తారా? అని ఆశ్చర్యపోతున్నారా అయితే కచ్చితంగా మీరు ఆ వీడియో చూడాల్సిందే. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో సదరు యువతి క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ ఓపెన్ చేసి దాన్ని సెనగ పిండిలో కలిపి నూనెలో వేయిస్తోంది. ఒకదాని తర్వాత మరో చాక్లెట్ ని కూడా అలాగే వేసి ఆమెను వేయించి బయటకు తీసింది.


ఇక ఈ వీడియోను ప్రణీత్ అనే ఒక డాక్టర్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. పంచుకోవడమే కాక రెస్ట్ ఇన్ పీస్ క్యాడ్బరీ అంటూ ఒక క్యాప్షన్ పెట్టారు. ఇక ఈ వీడియోకి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఇలా డైరీ మిల్క్ తో కూడా బజ్జీలు వేస్తారా? అని కొందరు ప్రశ్నిస్తుంటే మరొక యూజర్ తన అక్కను ట్యాగ్ చేసి బావగారి మీద ఇలా పగ తీర్చుకోమని సలహా ఇచ్చాడు. సాధారణంగా తీపి పదార్థాలతో బజ్జీలు వేయడం అనే కాన్సెప్టే కొత్తగా ఉంది అనుకుంటే ఏకంగా చాక్లెట్ తో బజ్జీలు వేసి సదరు యువతి మరింత ఆసక్తి పెంచేసింది.



ఇక ఈ వీడియో గురించి మరికొందరు వెరైటీ పేరుతో కొత్త వంటకాలు తయారు చేయాలని ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్రం ఇలా తింటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావా అని ప్రశ్నిస్తున్నారు. ఇక మరొక యూజర్ యూరోప్ కంట్రీస్ లో ఇలా చాక్లెట్ ని బాగా మరగబెట్టి తర్వాత తినడం తాను చూశానని చెప్పుకొచ్చారు. మరి మీరు ఇలా చాక్లెట్ బజ్జీ ఎప్పుడైనా ట్రై చేశారా? లేక ఇక మీదట ట్రై చేయాలని అనుకుంటున్నారా?  అనేది కింద కామెంట్ చేయండి.
Also Read: Hero Akhil Raj: బీచ్లో కొట్టుకుపోయిన యువహీరో.. చావు తప్పి కన్నులొట్ట బోయి!


Also Read: Actress Pragathi : నేను అందగత్తెని.. నాకు ఆఫర్లు వస్తాయ్.. నటి ప్రగతి బోల్డ్ కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook