Actress Pragathi : నేను అందగత్తెని.. నాకు ఆఫర్లు వస్తాయ్.. నటి ప్రగతి బోల్డ్ కామెంట్స్

Actress Pragathi in Open Heart With RK Promo నటి ప్రగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోకు గెస్టుగా వచ్చేసింది. ఇందులో తన అందం గురించి తానే చెప్పుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 23, 2022, 04:26 PM IST
  • నెట్టింట్లో నటి ప్రగతి సందడి
  • ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో హల్చల్
  • అందగత్తెని అంటూ చెప్పుకున్న ప్రగతి
Actress Pragathi : నేను అందగత్తెని.. నాకు ఆఫర్లు వస్తాయ్.. నటి ప్రగతి బోల్డ్ కామెంట్స్

Actress Pragathi :  నటి ప్రగతికి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. ఒకప్పుడు తన పాత్రలో ఎంతో సున్నితంగా కనిపించిన ప్రగతి ఇప్పుడు రెబల్ క్యాండిడేట్‌లా కనిపిస్తోంది. మోడ్రన్ తల్లి పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ప్రగతికి ప్రస్తుతం పూర్తి భిన్నమైన ఇమేజ్‌తో దూసుకుపోతోంది. కరోనా సమయంలో ప్రగతి అందరినీ ఆశ్చర్యపర్చింది. కరోనా టైంలో ప్రగతి తన డ్యాన్స్ వీడియోలు, జిమ్ వీడియోలు షేర్ చేస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

మాస్ డ్యాన్సులు వేస్తూ, లుంగీ కట్టుకుని డ్యాన్స్ వేయడం, క్లాసికల్ డ్యాన్సులు వేస్తూ ఇలా అందరినీ ఆకట్టుకుంది.ఇక వర్కవుట్లు చేస్తూ, జిమ్‌లో కష్టపడే తీరుని చూపించి షాక్‌కు గురి చేసింది. అయితే ఇప్పుడు ప్రగతి మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ డిమాండ్ ఉన్న నటిగా మారింది. సోషల్ మీడియాలో ఆమెను ఎక్కువగా యూత్ ఫాలో అవుతుంటుంది. అప్పుడప్పుడు ఆమె మీద ట్రోలింగ్ కూడా జరుగుతుంటుంది.

ఈ వయసులో ఇవి అవసరమా? అంటూ ఆమెను ట్రోల్స్ చేస్తుంటారు. అయితే ప్రగతి మాత్రం వాటికి ఎంతో కూల్‌గా రిప్లై ఇస్తుంటుంది. నేను అందంగా కనిపించేందుకు ఇవన్నీ చేయడం లేదు.. నేను ఆరోగ్యంగా ఉండేందుకు చేసుకుంటున్నాను అని చెబుతుంటుంది ప్రగతి. అయితే తాజాగా ప్రగతి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో కనిపించింది.

అక్కడ ప్రగతి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లకు అమ్మలా నటిస్తున్నారు కదా? అని అడగడం, అప్పటి హీరోయిన్లు ఇప్పుడు తల్లి పాత్రల్లో నటిస్తున్నారు.. మీకు కాంపిటీషన్ అవుతున్నారు కదా? అని అడిగితే అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. నేను అందెగత్తెని నాకు అవకాశాలు వస్తాయ్ అని తనది తాను చెప్పుకుంది. 

మీది మీరే సర్టిఫికేట్ ఇచ్చుకున్నారా? అని ప్రశ్నిస్తే.. మనది మనం చెప్పుకోవాలి కదా? అన్నట్టుగా ప్రగతి కౌంటర్ వేస్తుంది. ఇక ప్రగతి మాట్లాడిన మాటలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రగతి ప్రస్తుతం కామెడీ రోల్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఎఫ్ 3 సినిమాలో ప్రగతి కనిపించి అందరినీ నవ్వించేసింది. ఈ మధ్య ప్రగతి యాడ్స్‌లోనూ నటించేస్తోంది. బుల్లితెరపై శ్రీదేవీ డ్రామా కంపెనీలో కొన్ని రోజులు సందడి చేసింది. ఇంద్రజ, పూర్ణలు జడ్జ్‌లుగా తప్పుకోవడంతో ఆస్థానంలోకి ప్రగతి వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read : Actress Poorna Marriage : పూర్ణ పెళ్లి ఎప్పుడో అయిపోయిందంట.. అసలు విషయం చెప్పేసిన నటి

Also Read : Ginna Day 2 Collections : రెండో రోజు లెక్కలివే.. 'సర్దార్' జోరు.. 'జిన్నా' బేజారు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News