పాట పాడుతూ ఆవును ఆటపట్టిందామనుకున్న యువకుడు.. చివరికి ఏమైందో చూడండి! నవ్వు ఆపుకోలేరు
Cow Funny Video, Calf kicking Two boys who teased her. షోలే చిత్రంలోని `యే దోస్తీ హమ్ నహీ తోడేంగే` పాట పాడుతూ ఓ యువకుడు .. ఆవు దూడను ఆటపట్టించగా అది అదిరే ఝలక్ ఇస్తుంది.
Cow Funny Video, Calf kicking Two boys: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రస్తుతం పక్షులు, జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు నవ్వు పుట్టిస్తే.. మరికొన్ని హృదయాలకు హత్తుకుపోతాయి. మరికొన్ని వీడియోలైతే భయాందోళనకు గిరిచేస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అందరికీ నవ్వులు తెప్పిస్తుంది. మీరు ఈ వీడియోను మొత్తం చూశారంటే.. నవ్వు ఆపుకోలేరు.
ఈ వీడియోలో ఇద్దరు అబ్బాయిలు రోడ్డుపై వెళుతుంటారు. రోడ్డుపై చాలా ఆవులుఎం దూడలు విశ్రాంతి తీసుకుంటుంటాయి. ఆ ఆవుల మందను ఫుల్ స్వింగ్ లో ఉన్న ఇద్దరు అబ్బాయిలు చూస్తారు. షోలే చిత్రంలోని 'యే దోస్తీ హమ్ నహీ తోడేంగే' పాట పాడుతూ.. పడుకున్న ఆవులను ఆటపట్టిస్తుంటాడు. ఆవులు పాట పాడే అతడిని ఏమి అనవు. అయితే ఓ దూడ దగ్గరకు వెళ్లి దాన్ని హత్తుకునే ప్రయత్నం చేస్తాడు. అది వెంటనే అతడిని ఎగిరి తంతుంది. దెబ్బకు ఆ యువకుడు ఎక్కడో పడతాడు.
ఓ యువకుడిని ఆవు దూడ ఎగిరి తన్నగానే.. పక్కనే ఉన్న ఇంకో యువకుడు తెగ నవ్వుకుంటాడు. ఇందుకు సంబందించిన వీడియోను Alphatoonist పేరుతో ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేయబడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకు 121 లక్షల్లో వ్యూస్ మరియు లైక్స్ వచ్చాయి. అదే సమయంలో కామెంట్ల వర్షం కురుస్తోంది. 'బాగా అయింది' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఇది ఆ యువకుడికి ఓ గుణపాఠం' అంటూ ఇంకొకరు ట్వీట్ చేశారు. నెటిజన్లు ఈ వీడియోను చూసి బాగా నవ్వుకుంటున్నారు. ఇక ఆలస్యం ఎందుకు మీరూ చూసి నవ్వుకోండి.
Also Read: అందమైన యువతికి లిప్ కిసెస్ ఇస్తూ.. ముద్దుముద్దుగా మాట్లాడుతున్న చిలుక! 20 సార్లు చూశా
Also Read: Karan Johar: నయనతారను అలా అవమానించాలా.. కరణ్ జోహార్ పై అభిమానుల ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.