Parrot Viral Video: అందమైన యువతికి లిప్ కిసెస్ ఇస్తూ.. ముద్దుముద్దుగా మాట్లాడుతున్న చిలుక! 20 సార్లు చూశా

Parrot Funny Video, Parrot Talks To Woman. కివి అనే బ్లూ చిలుక తన యజమాని తమరా మెర్సర్ భుజంపై కూర్చొని ముద్దుముద్దుగా మాట్లాడుతోంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 24, 2022, 03:09 PM IST
  • అందమైన యువతికి లిప్ కిసెస్ ఇస్తూ
  • ముద్దుముద్దుగా మాట్లాడుతున్న చిలుక
  • సోషల్ మీడియాలో వైరల్
Parrot Viral Video: అందమైన యువతికి లిప్ కిసెస్ ఇస్తూ.. ముద్దుముద్దుగా మాట్లాడుతున్న చిలుక! 20 సార్లు చూశా

 Blue Parrot Talks and Gives Lip Kisses To Woman: ఈ భూ ప్రపంచంలో చిలుకలు మాట్లాడుతాయన్న విషయం తెలిసిందే. చిలుక ముందు ఏదైనా పదాన్ని పదే పదే చెబితే.. అది వెంటనే కంఠస్థం చేస్తుంది. మనం చెప్పేదాన్ని అలానే చెపుతుంది. 'చిలుక పలుకులు' ఎలా ఉంటాయో మనకు తెలుసు. చిలుక మాటలు చాలా తీయగా, మైమరిపించేలా ఉంటాయి. సోషల్ మీడియాలో చిలుకలకు సంబంధించిన అనేక వీడియోలను మనం చూసే ఉంటాం. ఇటీవల ఓ చిలుక ఐఫోన్ రింగ్‌టోన్‌ను ఖచ్చితమైన ధ్వనిని చేయగా.. మరో చిలుక టీ కావాలని డిమాండ్ చేసింది. ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలోవైరల్ అయ్యాయి.తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కెనడాలో నివసిస్తున్న తమరా మెర్సర్ అనే అందమైన యువతి.. కివి అనే బ్లూ చిలుకను పెంచుకుంటోంది. ఆ చిలుకకు మెర్సర్ చాలా మాటలు నేర్పించింది. ఈ క్రమంలోనే చిలుక తన యజమాని భుజంపై కూర్చొని ముద్దుముద్దుగా మాట్లాడుతోంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అనగా.. తన యజమాని కూడా యూ సో క్యూట్ అంటుంది. వెంటనే చిలుక ఆమెకు లిప్ కిస్ ఇస్తుంది. 'ఏమైంది?', ఓ మై గుడ్ నెస్ అని యజమానితో సహా అంటుంది. ఆపై ముహ్హ్ అంటూ మరోసారి ముద్దులు పెడుతుంది. ధన్యవాదాలు బేబీ అంటూ ప్రేమగా మరిన్ని ముద్దులు పెడుతుంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Animals (@pets.hall)

బ్లూ చిలుకకు సంబందించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో pets.hall అనే పేజీ షేర్ చేసింది. అయితే ఈ వీడియోను కెనడాలో నివసిస్తున్న చిలుక యజమాని తమరా మెర్సర్ TikTokలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 121 మిలియన్ వ్యూస్ మరియు 9.7 మిలియన్ లైక్స్ వచ్చాయి. నెటిజన్లు ఈ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు. తాను ఈ వీడియోని 20 సార్లు చూశానని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మొత్తానికి ప్రతిఒక్కరు ఈ వీడియోను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్‌లోని చాలా మంది తమ పెంపుడు జంతువులుగా బ్లూ చిలుకలను పెంచుకుంటారు. 

Also Read: IND vs WI: ప్రసిధ్ కృష్ణ ఔట్.. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో భారత జట్టులోకి కొత్త ప్లేయర్!

Also Read: Liger: మైండ్ బ్లాకయ్యేలా లైగర్ ఓటీటీ-శాటిలైట్ డీల్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News