House for Sale for Just Rs 89: ఏంటి ఇంకా నమ్మలేకపోతున్నారా ? కానీ ఇది ముమ్మాటికి నిజం. కాలిఫోర్నియాకు చెందిన 49 ఏళ్ల రూబియా డేనియల్స్ కి ఆ ఛాన్స్ వచ్చింది. పాడుబడిన పురాతన భవనాలకు డిమాండ్ లేకపోవడంతో వాటిని కలిగి ఉండే కంటే వదిలించుకోవడమే బెటర్ అని భావించిన యజమానులు వాటిని కారుచౌకగా రూబియాకు అమ్మేశారన్నమాట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి రూబియా స్వస్థలం బ్రెజిల్.. కానీ ఆమె క్యాలిఫోర్నియాలో స్థిరపడినప్పటికీ.. ఇటలీలోని ముస్సోమెలిలో ఊహించని రీతిలో అతి తక్కువ ధరకే ఇళ్లు కొనుగోలు చేసే అవకాశం రావడంతో ఆమె టెంప్ట్ కాకుండా ఉండలేకపోయింది. అయితే అవి కొత్త ఇళ్లు కావు. మనుషులు ఉండకుండా నిర్లక్ష్యంగా వదిలేసిన శిథిలమైపోయిన ఇళ్లు అన్నమాట. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు శిథిలమైన భవనాలను కొనుగోలు చేసింది. ఒక్కో భవనం ధర ఎంతో తెలిస్తే మీరు నోరు వెళ్లబెట్టడం ఖాయం.. అవును ఒక్కో భవనం ఖరీదు కేవలం అక్షరాల ఒక్క యూరో మాత్రమే. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 89 లే అన్నమాట.


ముస్సోమెలి ఈ మూడు శిథిలమైన భవనాలు కొనడంలో అవసరమైన డాక్యుమెంటేషన్ వర్క్, లావాదేవీల చెల్లింపుల పనిని అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే కేస్1 యూరో అనే సంస్థ రూబియాకు సహాయం చేసింది. ముస్సోమెలి పట్టణంలో స్థానికులు రూబియాను రిసీవ్ చేసుకున్న తీరు ఆమెకు బాగా నచ్చింది. అక్కడి వాతావరణం, మనుషుల మంచితనం చూసి ఫిదా అయిన రూబియా.. ఆ మూడు పాడుబడిన ఇళ్లను కొనడానికి అస్సలు ఏ మాత్రం ఆలోచించలేదు.పైగా వాటి కోసం ఆమె పెద్దగా వెచ్చించింది కూడా ఏమీ లేదు. ముందే చెప్పుకున్నాం కదా.. ఒక్కో ఇంటి కోసం ఆమె ఒక్క యూరోనే వెచ్చించింది అని. 


అయితే, అలా డెడ్ చీప్‌గా వచ్చిన ఆ ప్రాపర్టీలోనూ ఎవ్వరికీ కనపడని ప్రయోజనాన్ని రూబియా గుర్తించింది. ఏదైనా కొత్తగా చేయాలనుకున్నప్పుడు కొత్త భవనాలను నిర్మించడమే ఏకైక మార్గం అని కాకుండా.. ఇప్పటికే ఉన్న పాత కట్టడాలను వృధాగా పోనివ్వకుండా వాటిని రీడెవలప్ చేసి వనరులు వృధా కాకుండా చూడాలని అనుకుంది ఆమె. అంతేకాకుండా ఆ మూడు భవనాల్లో ఒకదాంట్లో ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేసి లోకల్ టాలెంట్ ని ప్రోత్సహించాలి అని అనుకుందామె. రెండో ఇంటిని ఆమె తన సొంత నివాసం భవనంగా మార్చుకోవాలనుకుంది. ఇక మూడో ఇంట్లో వెల్‌నెస్ సెంటర్‌ నిర్వహించి ముస్సోమెలిలోని స్థానికులకే తిరిగి ప్రయోజనం చేకూరేలా చేయాలి అని అనుకుంది. 


ఇది కూడా చదవండి : Leopard Attack Viral Videos: అడుగులో అడుగేసుకుంటూ సైలెంటుగా వచ్చిన చిరుత.. అక్కడే నిద్రిస్తున్న వ్యక్తి..


రూబియా డేనియల్స్ ప్లాన్స్ ఇలా ఉండగానే.. యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్ మహమ్మారి రూబియా ప్రణాళికలను కూడా డిస్టర్బ్ చేసింది. ఆ తరువాత 2020లో తాను కొనుగోలు చేసిన ఆ మూడు భవనాల పునరుద్ధరణ ప్రక్రియను మొదలుపెట్టింది. అలా ఇప్పటికే రెండు ఇళ్లకు సంబంధించిన పనిని బయటి నుంచి పూర్తి చేసింది. ఇక పనికిరావు అని అత్యంత చౌకగా అమ్మేసిన బంగ్లాలను ఎవ్వరూ నమ్మని రీతిలో పునరుద్ధరించి మళ్లీ అందరినీ అక్కడికి తీసుకెళ్లాలనే ధృడ సంకల్పంతో రూబియా డేనియల్స్ పని చేసుకుపోతోంది. ఈ మూడు పాత భవనాలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఇది కూడా చదవండి : Modi's Free Mobile Recharge Scheme: ఇండియాలో ఫ్రీ మొబైల్ రీచార్జ్ స్కీమ్.. మోదీ సర్కారు కానుక నిజమేనా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK