Viral Video: ఆపద సమయంలో ఆదుకునే అంబులెన్స్‌ ఘోర ప్రమాదానికి కారణమైంది. అత్యవసర సేవల కోసం అత్యంత వేగంగా వెళ్తున్న అంబులెన్స్‌ పొరపాటున కారు, బైక్‌లను ఢీకొట్టింది. ఫ్లైఓవర్‌పై బీభత్సం సృష్టించింది. ఇతర వ్యక్తుల ప్రాణం పోసేందుకు అంబులెన్స్‌ ప్రమాదానికి గురైన సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. అంబులెన్స్‌ సృష్టించిన బీభత్సం వీడియో వైరల్‌గా మారింది. సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియో చక్కర్లు కొడుతోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Scissor Missing: ఒక కత్తెరతో 36 విమానాలు రద్దు, 201 ఆలస్యం.. తీరా చూస్తే నవ్వుకోవడమే!


కర్ణాటకలోని బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటీ ఫ్లైఓవర్‌పై అంబులెన్స్‌ దూసుకెళ్తోంది. సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో అంబులెన్స్‌ కుయ్‌ కుయ్‌ అంటూ వేగంగా ప్రయాణిస్తూ ఫ్లైఓవర్‌ పైకి చేరుకుంది. అంబులెన్స్‌ రావడంతో మిగతా వాహనదారులు దారి ఇస్తున్నారు. అలాగే దూసుకుంటూ వస్తున్న అంబులెన్స్‌ ఓ కారును ఓవర్‌ టేక్‌ చేసే సమయంలో ప్రమాదం సంభవించింది. అంబులెన్స్‌ ఢీకొట్టడంతో ఆ కారు ఎగిరి ఓ ద్విచక్ర వాహనదారుడిపై పడింది. దీంతో అక్కడ బీభత్సం జరిగింది.


Also Read: Sheikh Hasina: తొలిసారి నోరు విప్పిన షేక్‌ హసీనా.. బంగ్లాదేశ్‌లో పరిస్థితికి అమెరికానే కారణం?


కాగా ఢీకొట్టిన అంబులెన్స్‌ ఎక్కడా ఆగకుండా ఆస్పత్రికి వెళ్లింది. అయితే ప్రమాదం విషయం తెలుసుకున్న మరో అంబులెన్స్‌ అక్కడకు వెంటనే చేరుకుని గాయపడిన కారులోని వ్యక్తులు.. ద్విచక్ర వాహనదారులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెంటనే స్పందించి ఫ్లైఓవర్‌పై ఎలాంటి వాహనాల రద్దీ లేకుండా సత్వరమే చర్యలు తీసుకున్నారు. అయితే ప్రమాద దృశ్యాలు ఓ కారు వెనుకాల కెమెరాలో రికార్డయ్యాయి.


ఆ వీడియో చూస్తే సినిమాలో చూసినట్టు ప్రమాద దృశ్యాలు ఉన్నాయి. అత్యంత వేగంగా వచ్చిన అంబులెన్స్‌ ఓవర్‌ టేక్‌ చేసే సమయంలో కారును ఢీకొట్టిన దృశ్యాలు నెటిజన్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. వాటిని చూసి వావ్‌ అంటున్నారు. అయితే ప్రమాదానికి గురయిన కారు, ద్విచక్ర వాహన బాధితులు అంబులెన్స్‌పై ఎలాంటి ఫిర్యాదు చేయనట్టు సమాచారం. ప్రాణాలు కాపాడేందుకు అంబులెన్స్‌ వేగంగా వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు సంఘటన జరగడంతో క్షతగాత్రులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook