Cat gym Video: మనలో చాలా మంది ఫిట్(Fit)గా ఉండేందుకు ఇష్టపడతారు. అందుకోసం జిమ్‌(gym)లల్లో తెగ కష్టపడుతుంటారు. గంటలకొద్దీ ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ..బాడీని తమకు కావాల్సిన విధంగా మలుచుకుంటారు. కొందరు సిక్స్ ఫ్యాక్స్ కోసం, మరికొందరు ఆరోగ్యం కోసం, ఇంకొందరు పొట్ట తగ్గించుకోవడానికి జిమ్ ల్లో చెమటోడుస్తుంటారు. అయితే మనుషులకు తాము కూడా ఏమాత్రం  తీసిపోమంటూ..జంతువులు కూడా ఫిట్ గా ఉండేందుకు ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ ఫన్నీ వీడియో(Funny Video) నెట్టింట తెగ హాల్ చల్ చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Viral Video: వామ్మో..! ఎంత పెద్ద పామో.. బుసలు కొడుతూ వంట గదిలోకి వెళ్లింది..కానీ చివరకు..


ఈ వీడియోలో...ఓ పిల్లి(Cat) హాయిగా పడుకుని పుష్ అప్స్(Push ups) చేస్తుండటాన్ని మీరు చూడవచ్చు. ఈ కరోనా సమయంలో పిల్లి తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. వీడియోలో పిల్లి వ్యాయామం చేసిన తీరును చూసి.. నెటిజన్లు తెగ ముచ్చటపడుతున్నారు. పిల్లిలాగే మనం కూడా పిటెనెస్ పై దృష్టిపెడితే బాగుంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook