Viral Video: స్కూల్ టీచర్ ను చెప్పులతో కొట్టిన విద్యార్థులు.. వీడియో వైరల్..
Viral Video:పాఠశాలలో స్టూడెంట్స్ అంతా కలిసి ఉపాధ్యాయుడిని తరిమికొట్టారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కూడా హెచ్చరించారు. దీంతో అతగాడు భయపడుతూ తన వెహికిల్ మీద పారిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Drunk Teacher Attacked By Stundents In Chhattisgarh Bastar: టీచర్ ను తల్లిదండ్రుల తర్వాత మూడో స్థానం ఇచ్చారు. తల్లిదండ్రుల తర్వాత తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తాడని భావిస్తారు. ఇంట్లో కంటే పిల్లలు స్కూల్ లోనే ఎక్కువ సమయం గడుపుతారు.దీంతో జీవితంలో ఎలా ఉండాలి. ఉన్నతస్థానంకు చేరుకొవడానికి ఏవిధంగా కష్టపడాలి అనే వాటిని ఉపాధ్యాయుడు తమ పిల్లకు నేర్పిస్తాడని అనుకుంటారు. కొందరు ఉపాధ్యాయులు స్కూల్ లో పిల్లలకు చక్కగా చదువులు చెప్తారు. పాఠాలతో పాటు, జీవిత పాఠాలు కూడా నేర్పిస్తారు. కానీ మరికొందరు టీచర్లు మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. స్కూల్ లో విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం, లైంగికంగా వేధించడం వంటివి చేస్తుంటారు. మరికొందరు ఇంకా నీచంగా.. తప్పతాగి స్కూల్ లకు రావడం కూడా చేస్తున్నారు.
మద్యం బాటిళ్లతో స్కూల్ కు వచ్చి స్టూడెంట్స్ లను వేధించడం, దూషించడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి వారి మూలంగా చదువు చెప్పే స్కూల్ టీచర్లకు సమాజంలో విలువ లేకుండా పోతుంది. ఇప్పటికే స్కూల్ టీచర్లు తాగి మద్యం మత్తులో స్కూళ్లకు వచ్చిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. తాజాగా, ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తివివరాలు..
ఛత్తీస్ గఢ్ లో బస్తర్ లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.బస్తర్ జిల్లాలోని పిలిభట్ట ప్రాథమిక పాఠశాలకు చెందిన ఒక ఉపాధ్యాయుడు ప్రతిరోజూ మద్యం తాగి పాఠశాలకు వచ్చాడు. ప్రతిరోజు మద్యంతాగుతూ స్కూల్ రావడం కామన్ గా మారిపోయింది. మద్యం తాగి స్కూల్ కు రావడమేకాకుండా.. స్టూడెంట్స్ ను నోటికొచ్చినట్లు దూశించేవాడు. క్లాసులు చెప్పమంటే నోటికొచ్చినట్లు తిట్టేవాడు. కొట్టడం చేసేవాడు. దీంతో విసిగిపోయిన విద్యార్థులు టీచర్ కు బుద్ది చెప్పానుకున్నారు.
Read More: Teen Girl Romance: నడిరోడ్డు మీద రొమాన్స్.. ఇద్దరమ్మాయిలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు..
ఇటీవల మరల ఉపాధ్యాయుడు తాగి స్కూల్ కు వచ్చాడు. ఇక.. ఇదే అదనుగా భావించిన స్టూడెంట్స్ అతనిపై తిరగబడ్డారు. చెప్పులు, రాళ్లు, కర్రలతో తిరగబడ్డారు. చేతికొచ్చిన వాటితో టీచర్ ను కొడుతూ వెళ్లిపోవాలంటూ కూడా హెచ్చరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వీడేం టీచర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. భలే బుద్ధి చెప్పారు స్టూడెంట్స్ అంటూ కామెంట్ లు పోస్టు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook