Chicken flying after drinking beer: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో మనుషులు, జంతులకు సంబంధించిన వీడియోలు ఎన్నో ఉంటాయి. ఇటీవలి కాలంలో సింహం, ఏనుగు, కోతి, కుక్క, కోడి, పాములకు సంబందించిన వీడియోస్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఎవరూ ఉహించని విధంగా ఉంటే.. మరికొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. తాజాగా ఓ కోడికి సంబందించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియో ప్రకారం.. ఓ ఇంటి ముందర గ్లాస్‌లో బీర్ పోసి ఉంటుంది. కొంత సమయం తరువాత ఆ గ్లాస్ దగ్గరకు ఓ కోడి పుంజు, కోడి పెట్ట వస్తాయి. మెల్లగా గ్లాసు దగ్గరికి వచ్చి దానిని రుచి చూస్తాయి. ఆపై అవి రెండు గ్లాస్‌లో బీర్‌ను తమదైన శైలిలో తాగుతాయి. కొంత సమయం తర్వాత కోడి పుంజు అచ్చు పక్షిలానే గాల్లోకి ఎగురుతుంది. ఇళ్ల పైనుంచి ఎగురుకుంటూ గాల్లో తేలిపోతుంది. సాధారణంగా కోడి అంత ఎత్తుకు ఎగరదు. బీర్ తాగడం వలన 'బాహుబలి'గా మారి అలా గాల్లోకి ఎగురుతుంది. 


ఈ వీడియోను '18plusguyy' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. వీడియో చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. కోడికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోకు 50 వేలకు పైగా వ్యూస్, 5 వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. 'బీరేసి బాహుబలిగా మారిన కోడి' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఇది సాధ్యమేనా భయ్యా' అని ఇంకొకరు ట్వీట్ చేశాడు. 


Also Read: బ్రదర్ ప్యాడ్లు మర్చిపోయావ్.. ప్రత్యర్థి ప్లేయర్స్ చెప్పగానే డగౌట్‌కు పరుగెత్తిన బ్యాటర్!


Also Read: Siddhartha: ఆ హీరోయిన్ తో ప్రేమలో సిద్దూ.. ఫోటోలు తీసిన వారిపై సీరియస్



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook