Swiggy Boy Attacked by Traffic Cop: తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ స్విగ్గి డెలివరీ బాయ్‌పై తన ప్రతాపం చూపించాడు. అతనిపై చేయి చేసుకున్న కానిస్టేబుల్ సెల్‌ఫోన్ లాక్కున్నాడు. రోడ్డున పోయే వాహనదారుల్లో ఒకరు దాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో సదరు కానిస్టేబుల్‌పై బదిలీ వేటు పడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోయంబత్తూర్‌కి చెందిన సతీష్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ సింగనల్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం (జూన్ 3) అవినాషి రోడ్డులో విధులు నిర్వర్తిస్తుండగా ఓ స్విగ్గీ బాయ్ చేసిన పని అతనికి ఆగ్రహం తెప్పించింది. అంతే.. ఆ స్విగ్గీ బాయ్‌ వద్దకు వెళ్లి బూతులు తిడుతూ చెడా మడా చెంపలు వాయించేశాడు. అతని చేతిలో ఉన్న సెల్‌ఫోన్ లాక్కుని విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.


ఇంతకీ ఆ స్విగ్గీ డెలివరీ బాయ్ ఏం చేశాడంటే.. ఆ మార్గంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ దూసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆ బస్సు రెండు వాహనాలను, ఓ పాదచారుడిని ఢీకొట్టబోయింది. కొద్దిపాటిలో ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్‌పై ఆగ్రహం చెందిన స్విగ్గీ బాయ్ మోహన సుందరం.. ఆ బస్సును ఆపి డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఇంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమేంటని అతన్ని ప్రశ్నించాడు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇది చూసి ట్రాఫిక్ కానిస్టేబుల్ సతీష్.. మోహన సుందరం వద్దకు వెళ్లి అతనిపై దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నాడు.ఆ స్కూల్ ఓనర్ ఎవరో నీకు తెలుసా అంటూ గద్దించాడు.ఏదైనా సమస్య ఉంటే ట్రాఫిక్ పోలీస్ చూసుకుంటారని... నీకేం పని అని మండిపడ్డాడు.


ట్రాఫిక్ పోలీస్ దాడిని ఓ వాహనదారుడు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. వీడియో ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో సదరు కానిస్టేబుల్‌పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్విగ్గీ బాయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కానిస్టేబుల్ సతీష్‌పై బదిలీ వేటు పడింది. 
 



Also Read: Chintamaneni Prabhaker: టీడీపీ నేత చింతమనేని హత్యకు షూటర్? ప్లాన్ చేసింది ఎవరంటే..?  


Also Read : Indian Box Office: రికార్డు స్థాయి కలెక్షన్లతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్.. ఈ ఏడాది కలెక్షన్లు ఏ రేంజ్‌లో ఉన్నాయంటే..


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook