Collector Couple: గణతంత్ర వేడుకలా.. రికార్డింగ్ డ్యాన్స్ ఈవెంటా? రొమాంటిక్ పాటలకు కలెక్టర్ డ్యాన్స్

Collector Couple Dance For Romantic Songs In Republic Day: దేశ రాజ్యాంగం అమలైన రోజు ఎంతో దేశభక్తితో ఉండాల్సి ఉండగా ఓ కలెక్టర్ తన ప్రేమ పాటలకు వేడుకగా చేసుకున్నాడు. గణతంత్ర వేడుకలు కాస్త రికార్డింగ్ డ్యాన్స్‌లుగా చేసి పడేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Collector Couple Dance: దేశ భక్తిని నింపే రోజు.. భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పుకునే రోజు.. జాతీయ పండుగ రోజును రికార్డింగ్ డ్యాన్స్ అడ్డాగా ఓ కలెక్టర్ మార్చివేశాడు. తన భార్యతో కలిసి రొమాంటిక్ పాటకు స్టెప్పులు వేయడం వివాదాస్పదంగా మారింది. తన భార్యతో ఎంతో ప్రేమగా.. హాయిగా కలెక్టర్ డ్యాన్స్ చేయడం వైరల్‌గా మారింది. జాతీయ పండుగ అయిన గణతంత్ర దినోత్సవం రోజు సినిమా పాటలకు భార్యతో కలిసి స్టెప్పులు వేయడంపై అందరూ తప్పుబడుతున్నారు.
ఏం జరిగింది?
కృష్ణాజిల్లాలో గణతంత్ర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఉదయం జెండావిష్కరణ అనంతరం సాయంత్రం కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా అధికారులకు ఎట్ హోమ్ పేరిట తేనేట్ విందు ఇచ్చారు. అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది మొత్తం పాల్గొన్నారు. సరదాగా మాట్లాడుకుంటూ అధికార యంత్రాంగం గడిపింది. ఈ క్రమంలో డీకే బాలాజీ ఒక అడుగు ముందుకు వేశారు. వెంటనే తన భార్యతో స్టేజీ ఎక్కి డ్యాన్స్ చేశారు.
Also Read: Sri Ram Idol Vandalise: తెలంగాణలో మరో ఆలయంలో దాడి.. శ్రీరాముడి విగ్రహం ధ్వంసం
అది కూడా దేశ భక్తికి సంబంధించిన పాట కాకుండా రొమాంటిక్ పాటకు స్టెప్పులు వేయడం వివాదంగా మారింది. ఒక పాట కాకుండా కొన్ని పాటలకు డ్యాన్స్ చేశారు. కలెక్టర్ దంపతులతో కలిసి జిల్లా అధికారులు కూడా మైమరచిపోయి వాళ్లు కూడా కలెక్టర్‌తో కలిసి డ్యాన్స్ చేయడం.. పాటలు పాడడం చేశారు. మొత్తానికి గణతంత్ర దినోత్సవాన్ని ఒక పార్టీలాగా.. రికార్డింగ్ డ్యాన్స్ ఈవెంట్‌గా చేశారు. ఈ వేడుకలకు మీడియాకు ఆహ్వానం పలకకపోవడం గమనార్హం.
కలెక్టర్ దంపతుల డ్యాన్స్ వీడియోలు బయటకు వచ్చాయి. ఆ వీడియోలు కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కలెక్టర్ దంపతుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గణతంత్ర వేడుకల్లో ఇలా డ్యాన్స్ చేయడం తప్పుబడుతున్నారు. 'రిపబ్లిక్ డే అంటే ఓ పవిత్రమైన రోజు. దేశం గర్వించదగ్గ రోజు. మన భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. ఈ రోజు ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి ఉప్పొంగుతుంది. ఇలాంటి రోజు ఇలా చేయడం తప్పు' అని నెటిజన్లు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.