Viral News: డొమోక్రాటిక్​ రిపబ్లిక్​ ఆఫ్ కాంగోకు చెందిన ఓ యువకుడు. ఒకేసారి ముగ్గురు కవలలను పెళ్లిచేసుకున్నాడు. బహు భార్యత్వం ఉన్న ఆ వ్యక్తికి.. ముగ్గురూ తమ ప్రేమను వ్యక్త పరచగా.. ఆ ముగ్గురుని పెళ్లాడాడు ఆ యువకుడు. ముగ్గురిని పెళ్లి చేసుకున్నాక.. ఆ యువకుడు ప్రేమకు హద్దులు లేవవి చెప్పడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూర్తి వివరాల్లోకి వెళ్తే..


డెమోక్రాటిక్​ రిపబ్లిక్​ ఆఫ్ కాంగోకు చెందిన లువిజో అనే 32 ఏళ్ల యువకుడికి ఇటీవల ముగ్గురు అక్కాచెల్లెల్లు (కవలలు) ప్రపోజ్​ చేశారు. ఆ ముగ్గురిని చేసుకునేందకు అంగీకారం తెలిపాడు లువిజో. ఆ ముగ్గురి అక్కాచెల్లెల్ల పేర్లు నడేజ్​, నటాషా, నటాలీ. అయితే రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఒకరికంటే ఎక్కువమందిని పెళ్లి చేసుకోవడం చట్టరిత్యమేనని న్యూయార్క్ పోస్ట్​ పేర్కొంది. దీనితో ఆతడు ముగ్గురిని ఒకేసారి పెళ్లి చేసుకోవడం వల్ల అక్కడ చట్టపరంగా ఎలాంటి సమస్య లేదని వివరించారు.


లువిజో ఏమన్నాటంటే..


'నా రాణుల ప్రపోజల్స్ కాదనలేకపోయా. ఇది చాలా పెద్ద నిర్ణయం. నా తల్లిదండ్రులకు నేను తీసుకున్న నిర్ణయంం నచ్చలేదు. అందుకే నా ఫ్యామిలీలో ఎవరూ పెళ్లికి హాజరు కాలేదు' అని లువిజో చెప్పుకొచ్చాడు.


ఏదైనా దక్కాలంటే.. మరొకటి పోగొట్టుకోక తప్పదని చెప్పాడు లువిజో. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ముగ్గురినరి పెళ్లి చేసుకోవడదం ఆనందగా ఉందని చెప్పుకొచ్చాడు. 'అందుకే నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ప్రేమకు హద్దులు లేవు' అని చెప్పుకొచ్చాడు.


ఆది సమస్య కాదనుకుంటున్నా..


మొదటగా నటాలీని తాను ప్రేమించానని.. తర్వాత ఆమె మిగతా ఇద్దరు కవలలను పరిచయం చేయగా.. వాళ్లు కూడా తనతో ప్రేమలో పడ్డారని చెప్పాడు. ఆయితే తొలుత ఆ ముగ్గురు తమ నిర్ణయాన్ని చెప్పగా ఏం అర్థం కాలేదన్నాడు. కానీ ముగ్గురూ కవలలు కావడం వల్ల చిన్నప్పటి నుంచి ప్రతీది పంచుకోవడం అలవాటని.. అందువల్లే తమకు భర్తను పంచుకోవడం పెద్ద కష్టం కాదని ఆ ముగ్గురు యువతుల్లో ఒకరు చెప్పడం విశేషం.


Also read: Panda Funny Video: క్యూటీ పాండా ఇందులో ఏం చేస్తుందో చూడండి- వీడియో వైరల్


Also read: Kacha Badam Trend: కచ్చా బాదమ్ పాటకు నెపాలీ చిన్నారి స్టెప్పులు- వీడియో వైరల్​!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook