Reels On Iphone: రీల్స్ కోసం ఐఫోన్ కొనాలని పసికందును.. ఎంత ఘోరం
Couple Sold Their Infant Baby Boy To Buy Iphone: తినడానికి తిండి కూడా దిక్కులేని ఈ దంపతులకు ఐఫోన్ ఎలా వచ్చింది అని అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు ఆ దంపతులను నిలదీశారు. ఏదైనా నేరం చేసి డబ్బు సంపాదించారా అని ప్రశ్నించారు. అదే సమయంలో ఇంట్లో బాబు కూడా కనిపించకపోవడంతో బాబు ఏమయ్యాడని నిలదీశారు.
Couple Sold Their Infant Baby Boy To Buy Iphone: కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగనాస్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేయడానికి ఐఫోన్ కొనడం కోసం ఓ జంట తమ 8 నెలల పసికందును మరొకరికి విక్రయించారు. 8 నెలల బాబును విక్రయించిన అనంతరం ఆ బాబు తండ్రి తన 7 ఏళ్ల కూతురిని సైతం విక్రయించేందుకు ప్రయత్నించాడని నార్త్ 24 పరగనాస్ పోలీసులు తెలిపారు. ఉన్నట్టుండి బాబు కనిపించకుండా పోవడం, ఆ తరువాత ఆ జంట దగ్గర ఐఫోన్ కనిపించడం చూసిన ఇరుగుపొరుగు వారికి అనుమానం రావడంతో శనివారం ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
తినడానికి తిండి కూడా దిక్కులేని ఈ దంపతులకు ఐఫోన్ ఎలా వచ్చింది అని అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు ఆ దంపతులను నిలదీశారు. ఏదైనా నేరం చేసి డబ్బు సంపాదించారా అని ప్రశ్నించారు. అదే సమయంలో ఇంట్లో బాబు కూడా కనిపించకపోవడంతో బాబు ఏమయ్యాడని నిలదీశారు. ఐతే బాబు తమ బంధువల వద్ద ఉన్నాడని ఆ జంట అబద్ధం చెప్పారు.
అయినప్పటికీ వారి ప్రవర్తనపై అనుమానం పోకపోవడంతో వారు చెప్పిన సమాధానం విని సంతృప్తి చెందని స్థానికులు ఈ విషయాన్ని స్థానిక కౌన్సిలర్ తారక్ గుహాకు ఫిర్యాదు చేశారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న కౌన్సిలర్ తారక్ గుహ.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో తల్లి అసలు నిజం ఒప్పుకుంది. ఐ ఫోన్ కొనడం కోసం తమ 8 నెలల పసికందును విక్రయించామని.. ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం కోసమే ఈ పని చేశామని అంగీకరించింది. పశ్చిమ బెంగాల్ అంతటా పర్యటించి రీల్స్ చేయాలనేది తమ ఆలోచనగా బాబు కన్న తల్లి నిజం వెల్లడించింది.
ఇది కూడా చదవండి : Little Boy Playing With Snake: చిన్న పిల్లాడే కానీ పెద్ద పాముకి చుక్కలు చూపించాడు
తల్లి నిజం ఒప్పుకోవడంతో పోలీసులు ఆ ఇద్దరు భార్యాభర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఆమె భర్త జయదేవ్ తమ 7 ఏళ్ల కుమార్తెను సైతం విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నాడని.. ఒకవేళ పోలీసులు అతడిని అరెస్ట్ చేయకపోతే శనివారం రాత్రే ఆ చిన్నారిని సైతం మరొకరికి విక్రయించి ఉండే వారని తెలిపారు. ఈ ఇద్దరు దంపతులు ఇచ్చిన సమాచారంతో బాబుని కొనుగోలు చేసిన రాహ్రాకు చెందిన ప్రియాంకా ఘోష్ అనే మహిళను కూడా నార్త్ 24 పరగనాస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే ఇలా కన్న కొడుకును మద్యం కోసం అమ్ముకున్న దంపతుల ఘటనను ఈ ఉదంతం మరోసారి గుర్తుచేసింది.
ఇది కూడా చదవండి : Cobra Enters Into Man's Shirt: చొక్కాలోకి చొరబడిన నాగు పాము.. పాపం అతడి పరిస్థేతేంటో మీరే చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి