Shri Anantha Padmanabha Swamy temple crocodile Babiya dies: బబియా.. ఈ పేరు వినగానే మనందరికీ వెంటనే గుర్తుకువచ్చేది కేరళలోని తిరువనంతపురం అనంతపద్మనాభ స్వామి కోనేరులో ఉండే మొసలి. అనంతపద్మనాభ స్వామి ఆలయంకు ఈ మొసలి సంరక్షకుడిగా ఉంటుందని అక్కడి వారు చెబుతుంటారు. బబియా గుడిలోని పూజారి ఇచ్చిన ప్రసాదం తప్ప మరేమీ ముట్టదు. శాకాహార మొసలిగా పేరుగాంచిన బబియా.. ఇకలేదు. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో బబియా మృతి చెందింది. ఈ విషయం స్థానికంగా ఎంతో మంది భక్తులను కలవరపెట్టింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బబియా మృతదేహాన్ని ఆలయం సమీపంలో ప్రజల సందర్శనార్ధం ఉంచారు. కోనేరు మొసలికి నివాళులర్పించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. బబియాను ఆలయ ప్రాంగణంలో దహనం చేయనున్నారు. మొసలికి గౌరవ సూచకంగా ఆలయ తలుపులు పూజారులు మూసేశారు. సోమవారం మధ్యాహ్నానికి అనంతపద్మనాభ స్వామి ఆలయం తిరిగి తెరవబడుతుంది. బబియా మృతికి సంబందించిన ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి.


పూజ సమయాలలో బబియా చెరువు లోంచి గుడికి వచ్చి స్వామివారిని దర్శించుకునేది. పూజారులు ఇచ్చే ప్రసాదం, నైవేద్యం తీసుకుని భక్తులకు ఇబ్బంది కలగకుండా తిరిగి చెరువులోకి వెళ్లేది. కేవలం గుడి ప్రసాదం మీదే బబియా జీవిస్తుండేది. చెరువులోని చేపలను తినదు కాబట్టి ఆ మొసలికి 'శాకాహార మొసలి'గా పేరు ఉంది. స్నానాలు కోసం కోనేరులోకి దిగిన భక్తులను కూడా బబియా ఏమీ అనేది కాదు. అనంతపద్మనాభ స్వామి ఆలయంకు వచ్చిన భక్తులు మొసలి కూడా చూసివెళ్లేవారు. 


అనంతపద్మనాభ స్వామి కోనేరులో ఉండే మొసలి గూర్చి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ మొసలి ఆలయ పరిరక్షణ చేస్తుందని, ఈ మొసలి చనిపోగానే మరో మొసలి అదే కోనేరులో పుడుతుందట. ఈ కోనేరులో ఎపుడూ ఒకే ఒక్క మొసలి ఉంటుందట. ఒకప్పుడు ఈ కోనేరులో మొసలిని ఒక ఆంగ్లేయడు చంపగా.. మరుసటి రోజు మరో మొసలి పుట్టిందట. ఈ మొసలికి ఆలయ పూజారులు ఉదయం, మధ్యాహ్నం పూజ అనంతరం అటుకులు, బెల్లం నైవేద్యంగా పెడతారు. ప్రసాదం తినగానే మళ్ళీ నీటిలోకి వెళ్ళిపోతుంది.


Also Read: Mulayam Singh Yadav Dead: ములాయం సింగ్‌ యాదవ్‌ ఫ్యామిలీ, ఎడ్యుకేషన్ వివరాలు ఇవే!


Also Read: మాథ్యూ వేడ్‌ పెద్ద చీటర్.. క్రికెట్ నుంచి ఆస్ట్రేలియాను బ్యాన్ చేసేయండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook