iPhone 15: అమెజాన్ లో ఐఫోన్ 15 ఆర్డర్ చేశాడు.. పార్శిల్ ఓపెన్ చేసి చూసి షాక్ తిన్నాడు..
viral: ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసి మోసపోతున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఐఫోన్ 15 ఆర్డర్ చేస్తే.. నకిలీది వచ్చింది. దీంతో అతడు తన బాధను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
Online Orders: షాపింగ్ యాప్స్ అందుబాటులో వచ్చాక ప్రతిదీ మన కాళ్ల దగ్గరకే వస్తుంది. అయితే ఆన్‌లైన్‌లో వస్తువుల కొనుగోలు చేయడం వల్ల కొన్ని సార్లు లాభాలతోపాటు నష్టాలను కూడా ఎదుర్కోవల్సి వస్తుంది. మనం ఒక వస్తువు ఆర్డర్ చేస్తే.. మరో వస్తువు రావడం, అసలు వస్తువు బదులు నకిలీ వస్తువు రావడం జరుగుతుంటాయి. తాజాగా అలాంటి చేదు అనుభవమే ఓ వ్యక్తికి ఎదురైంది. అతడు ఆ విషయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నాడు.
గబ్బర్ సింగ్ అనే వ్యక్తి అమెజాన్ లో ఐఫోన్ 15 ఆర్డర్ పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఫోన్ ఇంటికి డెలివరీ అయింది. ఓపెన్ చేసే చూస్తే నకిలీ ఐఫోన్ ఉంది. దీంతో గబ్బర్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన బాధను నెటిజన్స్ తో పంచుకున్నాడు. ‘అమెజాన్ నాకు నకిలీ ఐఫోన్ 15ను డెలివరీ చేసింది. ఇందులో కేబుల్ కూడా లేదు. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి సమస్య ఎదుర్కొన్నారా?’ అని ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. అమెజాన్‌ను ట్యాగ్ చేశాడు.
Also Read: Funny Video: ఇదెక్కడి పైత్యం రా బాబు.. గర్ల్‌ఫ్రెండ్ లేదని ఈ యువకుడు ఏం చేశాడో చూడండి..
దీంతో ఈ పోస్ట్ కు నెట్టింట విపరీతమైన స్పందన వచ్చింది. ఒక్కోక్కరు అమెజాన్ విషయంలో తమకు ఎదురైన అనుభవాలను కామెంట్ల రూపంలో పంచుకున్నారు. ‘లాప్‌ట్యాప్ బుక్ చేస్తే వాక్యూమ్ క్లీనర్ వచ్చింది’ అని ఒకరు..ఇక నుంచైనా అమెజాన్ నుంచి ఖరీదైన వస్తువులను కొనడం ఆపండని మరోకరు కామెంట్స్ చేశారు. తాజా ఘటనపై అమెజాన్ స్పందించి క్షమాపణలు చెప్పింది. అంతేకాకుండా ఐఫోన్ కోసం గబ్బరు వెచ్చించిన మెుత్తాన్ని రిఫండ్ చేసేందుకు ఒప్పుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter