Funny Video: ఇదెక్కడి పైత్యం రా బాబు.. గర్ల్‌ఫ్రెండ్ లేదని ఈ యువకుడు ఏం చేశాడో చూడండి..

Funny Video:  ప్రస్తుత రోజుల్లో మనం ఏదైనా డిఫరెంట్ గా చేస్తే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతుంది. తాజాగా ఓ యువకుడు తనకు లవర్ లేదనే కారణంతో వినూత్నంగా ఆలోచించి ఓ పని చేశాడు. అది కాస్త నెట్టింట వైరల్ గా మారిపోయింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2024, 10:58 PM IST
Funny Video:  ఇదెక్కడి పైత్యం రా బాబు.. గర్ల్‌ఫ్రెండ్ లేదని ఈ యువకుడు ఏం చేశాడో చూడండి..

Viral Video today: మనలో చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. ఈ క్రమంలో వారు చేసే పనులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఇందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. గర్ల్‌ఫ్రెండ్ లేదనే ఉద్దేశంతో ఓ యువకుడు డిఫరెంట్ గా ఆలోచించాడు. అతడు చేసిన పనికి జనాలు పగలబడి నవ్వుతున్నారు. ఇంతకీ అసలు ఆ కుర్రాడు ఏం చేశాడు, నెటిజన్స్ నవ్వడానికి కారణమేంటో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. 

లవర్ ను బైక్ పై తీసుకెళ్లడం కామన్. అయితే గర్ల్‌ఫ్రెండ్ లేని వారు సింగిల్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కానీ ఓ యువకుడు మాత్రం ఇదే విషయంపై తెగ ఆలోచించాడు. అతడికి ఓ ఆలోచన తట్టింది. అనుకున్నదే తడువుగా దానిని ఆచరణలో పెట్టాడు. గర్ల్‌ఫ్రెండ్ లేకపోవడంతో ఓ బొమ్మకు డ్రస్ వేసి, అందంగా ముస్తాబు చేశాడు. తర్వాత ఆ బ్యూటిపుల్ బొమ్మను తన బైక్ పై వెనకాల కూర్చోబెట్టుకుని ఊరంతా తిరిగాడు. అయితే చాలా మంది నిజంగానే వాళ్లు లవర్స్ అనుకున్నారు. అయితే కాస్త తీక్షణంగా పరిశీలించగా.. అది బొమ్మని తెలిసి షాక్ అయ్యారు. తర్వాత ఆ యువకుడి బైక్ వద్దకు చేరుకుని అందరూ నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అంతేకాకుండా ఈ వీడియోపై లైక్స్, కామెంట్స్ వర్షం కురుస్తోంది. 'వాటెన్ ఐడియా సర్జీ’.. అని కొందరు, ‘‘మీ జంట చాలా బాగుంది బ్రదర్’’.. అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by इंदौरीGram ® (@indorigram_)

Also Read: Bull stops Cricket Match: ఎద్దు వల్ల ఆగిన క్రికెట్ మ్యాచ్.. వైరల్ అవుతున్న వీడియో..

Also Read: Pet Lizard: బల్లిని లైట్ తీసుకుంటున్నారా.?.. యూఎస్ లో ఏంజరిగిందో తెలిస్తే షాక్ అవుతారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News