Viral Video: కొన్నది సెకండ్ హ్యాండ్ సైకిలే కానీ.. బెంజ్ కారు కొన్న రేంజ్లో సంతోషం! కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో
Viral Video, Father and Son buy second hand Cycle. తండ్రి సెకండ్ హ్యాండ్ సైకిల్ కొని ఇంటికి తీసుకురాగానే.. కొడుకు ఆనందంతో గెంతులేశాడు.
Father and Son Emotions goes viral after buy second hand Bicycle: ప్రతిఒక్కరికి తమ డ్రీమ్ బైక్ లేదా కారు ఒకటి ఉంటుంది. దానికి కొనాలని కలలు కంటారు. కొన్నాక గుడికి తీసుకెళ్లి పూజలు చేసి ఆనందపడుతారు. ముఖ్యంగా యువకులు పెద్దపెద్ద కార్లు, బైక్‌లు కొన్నప్పుడు ఆ ఆనందానికి అవధులు ఉండవు. తాజాగా ఇలాంటి అనుభూతే పొందాడు ఓ పిల్లాడు. తన తండ్రి కొన్నది సెకండ్ హ్యాండ్ సైకిలే అయినా ఆ పిల్లాడు ఎంతో సంతోషపడ్డాడు.
ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పంచుకున్నాడు. వీడియోలో ఒక గ్రామంలోని గుడిసె ముందు తండ్రి కొడుకులు ఉన్నారు. తండ్రి సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుకొచ్చాడు. కొత్త వాహనంకి పూజ చేసిన మాదిరిగానే.. దానికి దండ వేసి నీరు వదిలిలేశాడు. అనంతరం నమస్కరించాడు. పక్కనే ఉన్న కొడుకు ఆనందంతో గెంతులేశాడు. చప్పట్లు కొడుతూ పిల్లాడు కూడా దేవుడికి మొక్కుకున్నాడు.
సైకిల్‌కి పూజ చేస్తున్న సమయంలో బ్యాక్ గ్రౌండ్‌లోపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'పౌర్ణమి' సినిమాలోని 'మువ్వలా నవ్వకలా ముద్దమందారమా? అనే సాంగ్ ప్లే అవుతోంది. ఇక చిన్నారి ఆనందం చూస్తుంటే.. ఈ పాత సైకిల్ వారి కుటుంబానికి ఎంత ముఖ్యమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇందుకు సంబందించిన వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'ఇది సెకండ్ హ్యాండ్ సైకిల్. వారి ముఖాల్లో ఆనందం చూస్తుంటే.. కొత్త మెర్సిడెస్ బెంజ్ కొనుగోలు చేసినట్లు ఉంది' అని పేర్కొన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.
ఇప్పటివరకు సోషల్ మీడియాలో దాదాపు 2 మిలియన్ల మంది ఈ వీడియోను చూశారు. ఆ వీడియో ప్రజల హృదయాలను కదిలించింది. ఈ వీడియోపై ట్వీట్‌ల వర్షం కురుస్తోంది. 'పేదవారికి ఇదే మెర్సిడెస్ బెంజ్' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'ఈ పాత సైకిల్ వారి కుటుంబానికి ఎంత ముఖ్యమో ఇట్టే తెలుస్తుంది' అని ఇంకొకరు ట్వీటారు.
Also Read: Aishwarya Rai Bachchan Cannes 2022: కేన్స్‌లో ఐశ్వర్య రాయ్ తళుకులు.. ప్రత్యేక ఆకర్షణగా ఆరాధ్య!
Also Read: Mehreen Pirzada Pics: మెహ్రీన్ పిర్జాదా క్లీవేజ్ షో.. కుర్రాళ్ల మతులు పోగొడుతున్న ఎఫ్ 3 భామ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook