Snake Video Trend  In Google : ప్రపంచవ్యాప్తంగా భూమిపై వివిధ జాతులకు సంబంధించిన పాములు ఉన్నాయి. అందులో కొన్ని పాములు ఇతర జంతువులను వేటాడితే మరికొన్ని మాత్రం ఎంతో సాధారణంగా జీవిస్తాయి. ముఖ్యంగా అమెజాన్ అడవి ప్రాంతంలో జీవించే చాలా రకాల పాములు చాలావరకు విషపూరితమైనవే.. ఆ ప్రాంతంలో ఎక్కువగా కింగ్ కోబ్రాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ భారతదేశ వ్యాప్తంగా ఎక్కువగా కొన్ని జాతులకు చెందిన పాములే కనిపిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే కింగ్ కోబ్రాలతో పాటు రక్త పింజర వంటి జాతులకు సంబంధించిన పాములు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం అడవుల్లో ఆహారం దొరకకపోవడం కారణంగా చాలా పాములు ఆహారాలను వెతుక్కుంటూ జనావాసాల్లోకి సంచారం చేస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా జనావాసాల్లోకి సంచరించిన పాములను స్నేక్ క్యాచర్స్ పట్టుకొని సురక్షితమైన ప్రదేశానికి తరలిస్తున్నారు. ఇలా పట్టుకునే సందర్భాల్లో తీసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలా పాములను పట్టే వీడియోలే సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవలే ఓ స్నేక్ క్యాచర్ పొలాల్లో పట్టిన రక్త పింజరకు సంబంధించిన పాము వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. 


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 


విడియో వివరాల్లోకి వెళితే..తెలంగాణలోని మెట్‌పల్లి సమీపంలో ఉన్న ఓ మిరప తోటలోకి రక్త పింజర సంచారం చేస్తుంది. అయితే దీనిని గమనించిన కూలీలు వెంటనే స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు. ఆ స్నేక్ క్యాచర్ హుటాహుటిన మిరప తోటలోకి చేరుకొని పామును వెతుకుతూ ఉన్నాడు. ఆ పాము ఓ మిరప చెట్టుకు చుట్టుకొని ఉండడం గమనించిన స్నేక్ క్యాచర్..స్నేక్ క్యాచింగ్ స్టిక్‌తో దానిని పట్టుకోబోతాడు. ఆ పాము పట్టుకునే క్రమంలో పారిపోయేందుకు శతవిధాలుగా ప్రయత్నించింది. అయినప్పటికీ ఆ స్నేక్ క్యాచర్ ఏమాత్రం విడవలేకపోయాడు. 



ఈ రక్త పింజర పామును పట్టుకునే క్రమంలో ఓ వ్యక్తిపై విషాన్ని చివ్వడం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. ఈ పాము నుంచి వచ్చే విషయం చాలా ప్రమాదకరమైనది. ఈ విషయం నేరుగా కళ్ళలోకి పడితే కళ్లు శాశ్వతంగా పోయే అవకాశాలు కూడా ఉన్నాయని ఆ స్నేక్ క్యాచర్ తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు స్నేక్ క్యాచర్ చేస్తున్న సేవకు అభినందిస్తున్నారు. ఈ వీడియో సాగర్ స్నేక్ సొసైటీ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేశారు.


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి