Dalai Lama Lip Kiss Controversy: దలైలామా.. ఈ పేరు వింటే చాలు ఏదో తెలియని శాంతి మంత్రం మనస్సును కప్పేస్తుంది. ప్రపంచం తెలిసిన బౌద్ధ గురువు, శాంతి దూత.. శాంతి కపోతం దలైలామా. కానీ అలాంటి దలైలామా తాజాగా ఓ కొత్త వివాదంలో ఇరుక్కున్నాడు. ఓ మైనర్ బాలుడితో అసభ్య చేష్టలు చేస్తున్నట్టుగా ఉన్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను పరిశీలిస్తే.. దలైలామా ఓ మైనర్ బాలుడిని పెదాలపై లిప్ కిస్ పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలుడి పెదాలపై లిప్ కిస్ పెట్టుకున్న దలైలామా అంతటితో సరిపెట్టుకోలేదు.. ఆ తరువాత ఆ బాలుడిని తన నాలుకను నాకాల్సిందిగా ఆదేశించడం ఈ వీడియోలో చూడొచ్చు. దలైలామా వింత చేష్టలు చూసి యావత్ ప్రపంచం నివ్వెరపోతోంది. ఏంటి మనం చూస్తోంది దలైలామానేనా మరొకరా అని జనం ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. అంత తెలివి కలిగిన దలైలామా ఎందుకు అంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ జనం విస్తుపోతున్నారు. దలైలామాకు ఏమైంది అని విస్మయం వ్యక్తంచేస్తున్నారు.


జూస్ట్ బ్రోయెకర్ అనే నెటిజెన్ ఆ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసుకోగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. బౌద్ధ మతానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న దలై లామా.. భారత్‌కి చెందిన ఒక బాలుడి పెదాలపై ముద్దు పెట్టుకోవడంతో పాటు అతడిని తన నాలుక నాకాల్సిందిగా కోరడం ఏంటని జూస్ట్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. దలైలామా ఎందుకిలా ప్రవర్తిస్తున్నట్టు అని జూస్ట్ సందేహం వ్యక్తంచేశారు. 


ఆ బాలుడిపై బలవంతంగా అలా ప్రవర్తించడం దలైలామాకు ఆనందాన్ని ఇచ్చినట్టయితే.. అది కచ్చితంగా వేధింపుల కిందకే వస్తుందని కొంతమంది నెటిజెన్స్ తమ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో వెల్లడిస్తున్నారు. అయితే, ఇదంతా నాలుగు గోడల మధ్య రహస్యంగా జరిగిన తంతు కాదు.. పబ్లిగ్గా మతపరమైన బోధనలు చేసే క్రమంలో పబ్లిక్ ఈవెంట్ వేదికపైనే ఇదంతా జరిగింది. దీంతో ఇదంతా చూస్తూ అక్కడున్న పెద్ద వాళ్లు అడ్డుకోకుండా ఏం చేస్తున్నారు అంటూ ఇంకొంతమంది నెటిజెన్స్ మండిపడుతున్నారు. 


ఇది కూడా చదవండి : Baby Elephant Viral Video: పిల్ల ఏనుగు వింత చేష్టలు చూస్తే కడుపుబ్బా నవ్వడం ఖాయం


2019 లోనూ ఒకసారి దలైలామా ఇలాగే ఒకసారి నోరుజారి ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. తన స్థానంలో ఎవరైనా మహిళ వచ్చినట్టయితే.. ఆమె ఎంతో అందంగా ఉండాలి అని దలైలామా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారంరేపాయి. ధర్మశాలలో బ్రిటీష్ మీడియాతో మాట్లాడుతూ దలైలామా చేసిన ఈ వ్యాఖ్యలు ఆయనపై తీవ్ర విమర్శలకు కారణం అయ్యాయి. ఒక బౌద్ధ గురువు అయ్యుండి అందం గురించి అలా ఎలా మాట్లాడతాడంటూ దలైలామాపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దలై లామా చివరకు క్షమాపణలు చెప్పకతప్పలేదు.


ఇది కూడా చదవండి : Single Lion Vs Group of Hyena's: హైనాల ఆకలికి అంతుండదు.. ఒంటరిగా చిక్కిన సింహాన్ని ఎలా వెంటపడి తింటున్నాయో చూడండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK