Giant King Cobra Viral Video: ఇప్పటి వరకు మీ జీవిత కాలంలో మీరు ఎన్నో పాములను చూసి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఎన్నో స్నేక్స్ వీడియోలు చూసి ఉండొచ్చు .. కానీ ఇలాంటి  ఇంత భయంకరమైన స్నేక్ వీడియో మాత్రం ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. చూడ్డానికే ఎంతో వైల్డ్‌గా కనిపిస్తున్న ఈ స్నేక్‌ని చూడటానికే గుండె ధైర్యం సరిపోదు అని అనుకుంటే.. అంత భయంకరమైన పాముని వాళ్లు పట్టిన విధానం మరింత గూస్‌బంప్స్ తెప్పించేదిగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న ఈ స్నేక్ వీడియోను చూస్తే.. ముందుగా ఇద్దరు స్నేక్ క్యాచర్స్ పాములను పట్టేందుకు అడవిలోకి వెళ్లడం కనిపిస్తుంది. ఆ తరువాత కొద్దిసేపటికే ఆ ఇద్దరూ ఒక చోట ఆగిపోయారు. అక్కడ తమ కళ్ల ఎదురుగా కనిపిస్తున్న పొదల్లో వారికి పాము దాగి ఉంది అనే అనుమానం వచ్చింది. అంత కచ్చితంగా అక్కడ పాము ఉన్నట్టుగా వారికి అనుమానం ఎలా వచ్చిందో, ఎందుకు అనిపించిందో తెలియదు కానీ.. ఆ పొదల్లోని గడ్డిపోచలను పక్కకు జరిపి చూస్తే నిజంగానే అక్కడ వారికి పాము కనిపించింది. 


చూడ్డానికి అస్పష్టంగానే ఉన్నప్పటికీ .. ఆ పాము భారీ సైజులో ఉన్నట్టుగా ఆ పాము లావుగా ఉండటం చూస్తే అర్థం అవుతుంది. పైగా నల్లగా ఉన్న ఆ పాముపై భయంకరంగా ఏవో మచ్చలు కూడా ఉన్నాయి. అంత పెద్ద పాముని ఆ పొదల్లో ఉండగానే సరిగ్గా పాము తల పట్టుకుని బయటికి లాగాడు. ఆ పాము కాటేస్తే మనిషి అనే వాడు బతకడం కూడా కష్టమే. అయినా సరే అతడు గుడ్డిగా అంత ధైర్యం ఎలా చేశాడో అర్థం కావడం లేదు. ఆ పొదల్లో ఉన్న పాము ఏదో తిని మత్తుగా పడుకోవడం వల్లే అతి అతడు పట్టుకునేటప్పుడు తిరగబడలేకపోయింది అని ఆ పామును బయటికి తీశాకే అర్థమైంది. అయినప్పటికీ.. అప్పటికీ అతడి ఎడమ చేతిలో ఉన్న ఆ పాము తల భాగం ప్రతిఘటించడానికి... వీలైతే అతడికి నోరు తెరిచి కాటు వేయడానికి శతవిధాల ప్రయత్నిస్తూనే ఉంది. వీడియోలో ఆ దృశ్యాన్ని చూడొచ్చు.


ఇది కూడా చదవండి: King Cobra Venom: నాగు పాము కాటుకి అంత విషం ఉంటుందా ?



అంత పెద్ద పామును బయటికి లాగిన ఆ వ్యక్తి.. దానిని చేతుల్లోకి తీసుకుని పట్టుకునేందుకు ఎంతో కష్టపడటం స్పష్టంగా కనిపించింది. అందుకు ముఖ్య కారణాల్లో ఆ పాము ఎంతో పొడవుగా ఉండటం ఒక కారణం అయితే.. అది పెద్దగా, లావుగా ఉండటం మరో కారణంగా చెప్పుకోవచ్చు. అప్పటికే పెద్దగా ఉన్న ఆ పాము.. ఏదో జీవిని తినడం వల్ల మరింత బరువుగా తయారైంది. అందుకే ఆ పామును చేతుల్లోకి తీసుకోవడానికి అతడు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆ పాము తల అతడి చేతుల్లోంచి జారిపోయింది అంటే అది ఆ ఇద్దరిని కాటు వేయడం గ్యారెంటీ. అయినప్పపటికీ మొక్కవోని ధైర్యంతో అతడు అతి కష్టం మీద ఆ పామును తన సహచరుడు తీసుకొచ్చి ఇచ్చిన సంచిలో బంధించాడు. 


ఇది కూడా చదవండి: King Cobra Drinking Water Video: దాహంతో అల్లాడుతున్న కింగ్ కోబ్రాకు నీళ్లు తాగించిన ఘనుడు.. వీడియో చూసి నివ్వెరపోతున్న నెటిజన్లు


సాధారణంగా జనావాసాల్లోకి చొరబడిన పాములను స్నేక్ క్యాచర్స్ పట్టుకుని తీసుకుని వెళ్లి అడవుల్లో విడిచిపెడుతుంటారు. ఇది జనహితం కోసం చేసే పని. ఇందులో పాములకు కూడా ఎలాంటి హానీ తలపెట్టరు. కానీ ఈ వీడియో అందుకు భిన్నంగా ఉంది. ఇందులో ఉన్న వ్యక్తులు అడవిలోకే వెళ్లి మరీ ఈ భయంకరమైన పామును పట్టుకొస్తున్నారు. మరి ఈ పాముతో వీళ్లు ఏం చేస్తారనేదే ఇప్పుడు చాలామంది బుర్రలను తొలిచేస్తోన్న ప్రశ్న. ఏదేమైనా ఈ కింగ్ సైజ్ కింగ్ కోబ్రా స్నేక్ వీడియో మాత్రం వీక్ హార్ట్ ఉన్న వాళ్లకు హార్ట్ ఎటాక్ తెప్పించేదిగానే ఉంది కదా.


ఇది కూడా చదవండి: King Cobra with Hood: పడగవిప్పి నిటారుగా నిలబడిన నాగు పాము.. రాజసం చూసి నివ్వెరపోతున్న జనాలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook