ప్రపంచంలో అత్యంత ప్రమాదకర జీవాల్లో ఒకటి పాము. పాము నుంచి చాలా జంతువులు దూరంగా ఉండటమే కాకుండా..భయపడుతుంటాయి. అంతటి భయంకరమైన పాము మరో జంతువుకు ఆహారంగా మారితే ..వినేందుకే ఆశ్చర్యంగా ఉందా. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో రోజూ వేలాది వీడియోలు పోస్ట్ అవుతుంటాయి. కొన్ని వైరల్ అవుతుంటాయి. కొన్ని ఒళ్లు జలదరింపజేస్తుంటాయి. మరికొన్ని ఆసక్తి రేపుతుంటాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలైతే ఇంకా వైరల్ అవుతుంటాయి. అలాంటిదే  ఈ వీడియో. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నిజంగానే ఈ వీడియో ఆశ్చర్యం రేపుతోంది. ఇప్పటికే ఈ వీడియోను లక్షసార్లు చూసుంటారు. భారీగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


ఒళ్లు జలదరించే వీడియో


ఈ వీడియో ఓ బాతుకు సంబంధించింది. ఇందులో ఓ చిన్న బాతు కడుపు నింపేందుకు కాలువ ఒడ్డున పచ్చగడ్డిలో పురుగులు, కీటకాల కోసం వెతుకుతుంటుంది. అప్పుడే ఆ బాతుకు ఓ ప్రమాదకరమై పాము కన్పించింది. వెంటనే నోటితో ఆ పామును కర్చుకుంది. కొద్ది కొద్దిగా ఆ పామును చూస్తుండగానే..అమాంతం మింగేసింది ఆ బాతు. చూస్తుంటే ఒళ్లు జలదరిస్తోంది.



కొద్దికొద్దిగా పామును మింగుతుంటే..ఆ పాము తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటుంది. కానీ బాతు నోట్లోంచి తప్పించుకోవడం అసాధ్యమైపోయింది ఆ పాముకు. ఆశ్చర్యం ఏమంటే తోక భాగం నుంచి మింగడం మొదలెట్టింది. నోటితో కాటేసే అవకాశాలున్నాయనే భయం కూడా లేకుండా నింపాదిగా మింగేసింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. 


Also read: 1000 Notes Coming Back: 1000 రూపాయల నోట్లు మళ్లీ వస్తున్నాయా ? 2 వేల నోట్లు బ్యాన్ ? ఏది నిజం ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook