Matki Idli Prepartion Video: ప్రతిరోజు ఉదయంపూట ఏదో ఒక టిఫిన్ చేసుకుని తింటారు. ఇడ్లీ, ఉప్మా, దోశ, పూరీలు ఇలా రకరకాల టిఫిన్ లు తింటుంటారు. కానీ వీటన్నింటిలో కూడా చాలా మంది ఇడ్లీ చేయడానికే ఇంట్రెస్ట్ చూయిస్తారు. ఇడ్లీని పల్లి చట్నీ,కొబ్బరికాయ చట్నీలతో కలిపి తింటారు. మరికొందరు సాస్ తో కలిపి కూడా తింటారు. ఇంకొందరైతే.. గిన్నెలో వేడి వేడి సాంబార్ లో ఇడ్లీని వేసుకుని మరీ తింటుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అయితే.. ఇప్పుడిక మట్కీ ఇడ్లీ ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచింది. ఇప్పటి దాక.. కుండలో చికెన్, కుండ టీలో తయారు చేయడం మనం చూశారు. కుండలో అన్నం వండుతుంటారు. అనేక రకాల పదార్థాలు తయారు చేస్తుంటారు. కానీ ఇప్పుడిక కుండలో ఇడ్లీని తయారు చేయడం కాస్త డిఫరెంట్ గా ఉండటంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. 


ఢిల్లీలో  @universal_exploring ద్వారా ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ లో మట్కీ ఇడ్లీ తయారు చేసే ప్రాసెస్ రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది సెకన్ల వ్యవధిలో వైరల్ గా మారింది. దీనిలో ఈ చిన్న చిన్న  ఇడ్లీలను మొదట తయారు చేసుకుంటున్నారు. ఆతర్వాత సాంబార్, చట్నీ, అల్లంచట్నీలను రెడీగా ఉంచుకుంటున్నారు. అప్పుడు.. ఒక చిన్నకుండను తీసుకుని దానిలో.. సాంబార్, ఇడ్లీలు, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ వేశారు.


ఆతర్వాత.. స్టౌవ్ మీద కాసేపు ఉంచుతున్నారు. దీంతో అదంతా మిక్స్ అయిపోయిపోతుంది. అప్పుడు వేడి వేడి టెస్టీ మట్కీ ఇడ్లీని కస్టమర్ లకు సర్వ్ చేస్తున్నారు. దీన్ని చూసిన నెటిజన్లు తమదైన స్టైల్ లో కామెంట్ లు పెడుతున్నారు. ఇదేం వంటకంరా బాబు.. ఇది.. నార్త్ వాళ్లకు నచ్చుతుందేమో కానీ సౌత్ వాళ్లు మాత్రం అస్సలు ఇష్టపడరని కామెంట్ లు పెడుతున్నారు.


Read More: Malavika Mohanan: అందాల బ్లాస్ట్ చేసిన మలయాళీ కుట్టి.. తట్టుకోలేకపోతున్న కుర్రకారు..


మరికొందరు మాత్రం ఇడ్లీలతో ఆటలొద్దని, చూడ్డటానికి అంత బాగా లేదని కూడా కామెంట్ లు చేస్తున్నారు.  ఈ ప్రయోగాలతో ఫుడ్ ఐటమ్స్ ను నాశనం పట్టించేలా ఉన్నారే .. అంటూ మరికొందరు కోప్పడుతున్నారు. వామ్మో.. కొబ్బరి చట్నీని వేడిచేయడమేంటని ఇంకొందరు సెటైర్ లు వేస్తున్నారు. కానీ ఇంకోందరు మాత్రం.. వావ్ .. మట్కీ ఇడ్లీ అదుర్స్.. వీడియో చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయంటూ కూడా కామెంట్ లు పెడుతున్నారు. ఏది ఏమైన ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం మట్కీ ఇడ్లీ వీడియో హట్ టాపిక్ గా మారింది. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook