King Cobra Venom Viral Videos: కింగ్ కోబ్రా.. నాగు పాము విషం ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. నాగు పాము కాటు వేస్తే.. తక్షణమే స్పందించి బాధితుడికి తగిన వైద్య సహాయం అందించకపోతే ప్రాణాలు పోతాయి. స్నేక్ సైన్స్ విషయంలో చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి.. ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరితమైన పాము కింగ్ కోబ్రాకు పేరుంది. నాగు పాములు దాదాపు 20 అడుగుల పొడవు వరకు ఉండటమే కాకుండా.., నాగు పాము కాటులో కనీసం 11 మందిని లేదా ఒక ఏనుగును చంపేంత విషం ఉంటది. కేవలం ఒక్క కాటులోనే అంత విషం వస్తుందట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాగు పాము కాటు ఎందుకు అంత శక్తివంతమైనది ? నాగుపాము ఒక్కసారి కాటేస్తే ఎంత విషం విడుదల అవుతుంది ? పాము కరిచినప్పుడు వచ్చే విషం చూడ్డానికి ఎలా ఉంటుంది ? ఇలా చాలామందికి చాలా రకాల సందేహాలు ఉంటాయి. ఇదిగో వీడియో చూస్తే దాదాపు సందేహాలు అన్నీ క్లియర్ అవుతాయి. పాము కాటేసినప్పుడు విషం ఎలా విడుదల అవుతుంది , పాము కాటులో ఎంత విషం ఉంటుంది అనే సందేహాలను నివృత్తి చేస్తూ సర్పాల ప్రేమికుడు బ్రియాన్ బర్జిక్ తన యూట్యూబ్ చానెల్లో ఒక షార్ట్ వీడియోను పోస్ట్ చేశాడు.


బ్రియాన్ బర్జిక్ పోస్ట్ చేసిన ఈ షార్ట్ వీడియో ఇంటర్నెట్లో ఫుల్ వైరల్ అవుతోంది. ఇప్పటికే నాలుగున్నర మిలియన్లకు పైగా నెటిజెన్స్ ఈ వీడియోను లైక్ చేయగా.. దాదాపు పది వేల మంది వరకు ఈ వీడియోను చూసి తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో వ్యక్తపరిచారు. కింగ్ కోబ్రా కాటులో ఒక్క కాటులో 400 నుంచి 500 mg వరకు విషం ఉంటుంది అని అధ్యయనాలు చెబుతున్నాయి. 


పాము కాటులో నిజంగా అంత విషం ఉంటుందా ? నమ్మకపోతే వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


పాము కాటుతో వచ్చే విషం ఎంత పవర్‌ఫుల్ అనేది చెప్పడానికి ఇక్కడ మరొక విషయం కూడా ప్రస్తావించుకోవాలి. నాగు పాము ఒక ఎలుకను చంపడానికి పాము 1 mg కంటే కొంచెం ఎక్కువ విషాన్ని మాత్రమే ఉపయోగిస్తుందట. బ్రియాన్ బర్జిక్ వద్ద ఇలాంటి యూట్యూబ్ వీడియోలు ఎన్నో ఉన్నాయి. పాముల గురించి ఒక్కో వీడియో ఎన్నో విషయాలను చెబుతున్నట్టుగా ఉంటాయి ఆ వీడియోలు. అవి ఎంత భయంకరమైన సర్పాలైనా సరే.. బ్రియాన్ అసలు వెనక్కి వెళ్లే ప్రసక్తే  లేదు.   


ఇది కూడా చదవండి : Wild Giant King Cobra Snake: గుండె చేత పట్టుకుని చూడాల్సిన పొడవైన నాగు పాము వీడియో


ఇది కూడా చదవండి : Whiskey Maggi Recipe: మ్యాగీతో మందుబాబు ప్రయోగం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK