Whiskey Maggi Recipe: మ్యాగీతో మందుబాబు ప్రయోగం

Whiskey Maggi Recipe: మందు బాబులు ఏం చేసినా కొత్తగానే చేయాలనుకుంటుంటారు. చేసే ప్రతీ పనిలో తమదైన స్టైల్ చూపించుకోవాలని తాపత్రయపడుతుంటారు. ఆ క్రమంలో తమకి తెలియకుండానే ఎన్నెన్నో వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అలాంటిదే. 

Written by - Pavan | Last Updated : Jun 9, 2023, 08:16 PM IST
Whiskey Maggi Recipe: మ్యాగీతో మందుబాబు ప్రయోగం

Whiskey Maggi Recipe: మందు బాబులు ఏం చేసినా కొత్తగానే చేయాలనుకుంటుంటారు. చేసే ప్రతీ పనిలో తమదైన స్టైల్ చూపించుకోవాలని తాపత్రయపడుతుంటారు. ఆ క్రమంలో తమకి తెలియకుండానే ఎన్నెన్నో వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అలాంటిదే. సాధారణంగా ఎవరైనా మందు బాటిల్ కళ్ల ముందు కనబడితే ఏం చేస్తారు.. ఫ్రెండ్స్ తో కలిసి ఒక పెగ్గు కలుపుకుని ఎంచక్కా ఎంజాయ్ చేస్తారు. కానీ ఇదిగో ఈ వీడియోలో మనం చూస్తున్న సీన్ లో ఉన్న వ్యక్తి మాత్రం అలా చేయలేదు. విస్కీతో మ్యాగీ వంటకం చేసి ఒక వింత ఫుడ్ కాంబోను సెట్ చేశాడు. 

విదేశాల్లోనే కాకుండా మన ఇండియాలోనూ మ్యాగీ అంటే పడిచచ్చే వారి సంఖ్య భారీగానే ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఏదైనా వంట చేసుకునేందుకు మన వద్ద ఎక్కువ సమయం లేకపోయినా... లేదా బాగా అలిసిపోయి వంట చేసుకునే ఓపిక లేకపోయినా.. వెంటనే కళ్ల ముందు మెదిలే ఐడియా పేరే మ్యాగీ. అంతేకాకుండా సమయం, ఓపికలతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఇన్‌స్టంట్ ఆహార పదార్థాల్లో మ్యాగీ కూడా ఒకటి. 

అన్నింటికి మించి చల్లటి ప్రదేశాల్లో మ్యాగీ ఒక ఫేమస్ ఫుడ్ ఐటం. జమ్మూకశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మ్యాగిని వివిధ రెసిపిలతో, వివిధ రకాల విధానాల్లో వండుకుని తినడం మీరు చూసి ఉండొచ్చునేమో కానీ ఇదిగో ఇలా విస్కీ పోసి వండటం మీరు ఎప్పుడైనా చూశారా ? చూడకపోతే ఇదిగో ఈ వీడియోపై ఓ లుక్కేయండి. 

 

విస్కీతో మ్యాగీని ప్రేపేర్ చేసిన ఈ మందు బాబు.. ఆ వంటకాన్ని ఎలా వండాలి అనే విధానాన్ని కూడా వివరించారు. చూడ్డానికి అచ్చం ఏదో కుకరీ ఛానెల్లో మ్యాగీ రెసిపి వీడియో తరహాలో ఉన్న ఈ వీడియోకు ఇంటర్నెట్లో నెటిజెన్స్ నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజెన్స్.. ఎవరికి తోచిన అభిప్రాయాన్ని వారు కామెంట్స్ రూపంలో వెల్లడిస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా.. వాట్సాప్ లాంటి కంటెంట్ షేరింగ్ యాప్స్‌లో విపరీతంగా షేర్ అవుతోంది. ఇలాంటి ప్రయోగాలకు దూరంగా ఉండటమే ఆరోగ్యానికి మంచిది. లేదంటే ఇలాంటి ప్రయోగాల వల్ల ఫుడ్ పాయిజన్ అయి ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదం ఉంది.

Trending News