Dog Saves Owner: యజమాని పై అత్యాచారం చేయబోయిన వ్యక్తి ప్రైవేట్ పార్ట్ కొరికేసిన కుక్క.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..
Dog Save Human Life: కుక్క తన యజమానిపై హత్యాయత్నం చేయబోయిన వ్యక్తి ప్రైవేట్ పార్ట్ కొరికిన సంఘటన రష్యాలో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కుక్క చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మీరు ఈ వీడియోని చూశారా?
Dog Save Human Life: కుక్కలు ఎంత విశ్వాసమైనవో అందరికీ తెలుసు..అందుకే వీటిని ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు. యజమానులు తినే ఆహారాలను ఎంతో ప్రేమతో వాటికి పెడుతూ ఉంటారు. ఇవి ఏవైన సంఘటనలు జరిగినప్పుడు ఎంతో అలర్ట్‌గా ఉంటాయి. రాత్రిపూట గుర్తు తెలియని వ్యక్తులు పరిమిషన్ లేకుండా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు. ఇవి మనుషులపై దాడి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి సంఘటన ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ కుక్క చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ రోజు వైరల్ అవుతున్న వీడియో ఏమిటో.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే..మనం ఓ వ్యక్తి హాస్పిటల్ లో తన ప్రైవేటు పర్ట్ ను పట్టుకొని పరుగులు తీస్తున్న వీడియోలు చూడొచ్చు. అయితే తన ప్రైవేట్ పార్ట్ పట్టుకోవడానికి కారణాలు ఏంటని తెలుసుకుంటే. ఈ గాయానికి గురైన వ్యక్తి.. ఓ ఇంట్లోని యువతిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే దీనిని గమనించిన ఆ ఇంట్లో కుక్క వెంటనే ఆ వ్యక్తి పై దాడికి దిగింది. అంతే కాదండోయ్.. ఆ వ్యక్తి ప్రైవేట్ పార్ట్ ను కూడా కొరికేసింది.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
ఇలా ఆ వ్యక్తి వెంటనే ఇంట్లో నుంచి పరుగులు తీస్తూ బయటికి వచ్చాడు. పక్కనే ఉన్న హాస్పిటల్ లోకి వెళ్ళగా డాక్టర్లు వైద్యానికి నిరాకరించారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేస్తేనే వైద్యం చేస్తామని డాక్టర్లు తెలిపారు. ఇక ఆ వ్యక్తి నొప్పులు భరించలేక హాస్పిటల్లో అటు ఇటు ఉరుకులు పరుగులు పెట్టారు. ఇలాంటి కుక్కలు నూటికి 50 ఉంటాయని సోషల్ మీడియా వినియోగదారులు వీడియో కింద కామెంట్లు చేస్తున్నారు. కుక్క తన యజమాని పట్ల విధేయతను కలిగి ఉండడం చూసి అందరూ కుక్కను అభినందిస్తున్నారు.
ఈ సంఘటన రష్యాలోని తులా జరిగిందని సమాచారం. ఈ వైరల్ అవుతున్న వీడియోను @igorushko అనే ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేశారు. వీడియోను చూసిన నెటిజన్లు కుక్కను ప్రశంసిస్తున్నారు. మరికొందరు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు..
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి