Tiger Dog Viral Video: పులి చెవి కొరికేసిన కుక్క.. పక్కనే సింహం! ఫన్నీ వీడియో
Funny Viral Video: Dog bites Tiger`s Ear in Zoo. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో ఓ కుక్క భారీ పులి చెవిని కోరికేసింది. పక్కనే ఓ పెద్ద సింహం ఈ ఘటనను చాలా ఎంజాయ్ చేసింది.
Dog Trying To Bite Tigers Ear in Zoo: సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబందించిన చాలా వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు చాలా సరదాగా ఉంటే.. మరికొన్ని మాత్రం చాలా భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కుక్క పెద్ద పులి చెవిని కోరికేసింది. పక్కనే ఉన్న సింహం ఈ ఘటనను చాలా ఎంజాయ్ చేసింది.
సినిమాలో తప్ప పులి, సింహం, కుక్క ఒకదానితో ఒకటి ఎప్పుడూ కలిసి ఉండవు. అయితే ఎప్పటికీ కలిసిపోలేని ఈ మూడు జంతువులు జూలో ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉన్నాయి. ఈ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు అవి సరదాగా ఆడుకుంటుంటే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆదుకునే క్రమంలో పులి చెవిని కుక్క కొరికే ప్రయత్నం చేస్తుంది. అయినా కూడా కుక్కను ఆ పులి ఏమీ అనదు. చాలా సమయం అయినా కూడా కుక్క చెవిని వదలక పోవడంతో.. పులి తన పంజా విసురుతుంది. అయినా కూడా కుక్క ఏ మాత్రం బెదరకుండా సరదాగా ఆడుకుంటుంది.
పులి చెవిని కుక్క కోరుకుతుండగా.. పక్కనే సింహం చాలా ఎంజాయ్ చేస్తుంటుంది. కుక్క, పులి యుద్ధం మధ్యలోకి రావడం ఇష్టంలేక సింహం దూరంగా ఉండిపోతుంది. కుక్క, పులి ఆటను అది ఎంచక్కా ఎంజాయ్ చేస్తుంది. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో 'అనిమల్స్_పవర్స్' (Animals Power) అనే పేజీ పోస్ట్ చేసింది. ఈ వీడియోకి 'డాగ్ Vs టైగర్' అనే క్యాప్షన్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ మరియు లైక్‌లు వచ్చాయి. 'కుక్కకు ఎంత ధైర్యం భయ్యా' అని ఒకరు కామెంట్ చేయగా.. 'సింహం ఎంచక్కా ఎంజాయ్ చేస్తుంది పో' అని ఇంకొకరు కామెంట్ చేశారు.
Also Read: Asli Monalisa Hot Pics: యెల్లో శారీలో అస్లీ మోనాలిసా.. అమ్మడి హాట్ అందాలు చూస్తే దిమ్మాక్ ఖరాబే!
Also Read: నార్మల్ డెలివరీలో ఒకేసారి ఐదుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చిన మహిళ.. అందరూ ఆడపిల్లలే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.