Woman Gives Birth to Five Childrens at Ranchi RIMS: ప్రస్తుత రోజుల్లో నార్మల్ డెలివరీలు చాలా చాలా తక్కువ అవుతున్నాయి. దాదాపుగా ఆపరేషన్ లేకుండా మహిళలు తమ బిడ్డలకు జన్మనివ్వడం లేదు. కవలలు పుడితే అందులో ఒకరు చాలా వీక్‌గా ఉంటారు. అలాంటిది ఓ మహిళ నార్మల్ డెలివరీలో ఒకేసారి ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. తల్లితో పాటు పిల్లలూ క్షేమంగా ఉన్నారు. అయితే పుట్టిన ఐదుగురు ఆడపిల్లలు కావడం విశేషం. ఈ ఘటన జార్ఖండ్‌లోని రాంచీ రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
ఐదుగురు శిశువులు తక్కువ బరువుతో పుట్టడంతో ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తల్లీ బిడ్డలు క్షేమంగానే ఉన్నారని రిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీ నగరంలో ఉన్న రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన జరిగినట్లు డాక్టర్లు ట్వీట్టర్‌లో వెల్లడించారు. 'ఛాటర్‌కు చెందిన ఓ మహిళ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అందరూ క్షేమంగా ఉన్నారు. శిశువుల బరువు తక్కువ ఉండడంతో ఎన్‌ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నాం' అని రిమ్స్ తన ట్వీట్లో పేర్కొంది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అనితా కుమారి (27) జార్ఖండ్‌లోని చత్రా జిల్లా ఇత్‌ఖోరీ బ్లాక్ పరిధిలోని మలక్‌పూర్ గ్రామ నివాసి. ఆరోగ్య సమస్యలు ఉండటంతో అనితా గర్భం దాల్చలేదు. పలు చికిత్సలు తీసుకున్న తరువాత ఎట్టకేలకు ఆమె గర్బం దాల్చింది. గర్భవతి అయిన అనితా కుమారి గత నెల రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. చత్రా జిల్లాలో వైద్యుడికి చూపించగా.. కడుపులో ఐదుగురు పిల్లలు ఉన్నట్లు స్పష్టం అయింది. పరిస్థితి ప్రమాదకరంగా ఉందని రిమ్స్‌కు వెళ్లమని చెప్పాడు. అనితా భర్త ప్రకాష్ సావు ఆమెను రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించాడు.
డాక్టర్ శశిబాల సింగ్ మరియు అతని సహచరులు ఆపరేషన్ లేకుండా అనితా కుమారికి సోమవారం రాత్రి సాధారణ ప్రసవం చేశారు. తల్లి, ఐదుగురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. పిల్లలు 750 గ్రాముల నుంచి 1.1 కిలోల వరకు బరువు ఉన్న కారణంగా వారిని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసీయూ)లో ఉంచారు. ఏడు నెలల ఐదు రోజులకు ప్రసవం జరిగింది. ఒకే ప్రసవంలో ఐదుగురు పిల్లలు జన్మించడం అత్యంత అరుదుగా జరుగుతుందని డాక్టర్ శశిబాలా సింగ్ డెలివరీ అనంతరం వెల్లడించారు. రిమ్స్ చరిత్రలో ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలు జన్మించడం ఇదే తొలిసారి అని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
తన భార్య, ఐదుగురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నందుకు రిమ్స్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ప్రకాష్ సౌ మీడియాతో తెలిపారు. ఐదుగురు పిల్లలను ఒకేసారి పెంచడం సవాలు అని, ఇదంతా ఆ భగవంతుడి ప్రసాదం అని అన్నాడు. భవిష్యత్తులో దేవుడి అండదండలతో వారిని పెంచుతానని తెలిపాడు.
Also Read: Simple One Electric Scooter: సింపుల్ వన్ ఈవీ వచ్చేసింది.. సింగిల్ ఛార్జింగ్‌పై 212 కిమీ ప్రయాణం!
Also Read: GT vs CSK Qualifier 1: ఎంఎస్ ధోనీ వ్యాఖ్యలను ఖండించిన లసిత్ మలింగ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.