Dog Volleyball: కుక్కల వికృత చేష్టలు అప్పుడప్పుడు ఇంటర్నెట్‌లో ఎక్కువగా వైరల్ అవుతూ.. నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. చాలామంది శునకాలను పెంచుకుంటుంటారు. ఈ క్రమంలో మనుషులు చేసే కొన్ని పనులను శునకాలు కూడా అనుసరిస్తుంటాయి. అలానే మనుషుల మాదిరి శునకాలు కూడా వాలీబాల్ ఆడుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియో ఎంతో సరదాగా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియోలో ఏముంది?


ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిన ఈ వీడియో ప్రకారం.. ఆరు శునకాలు ఉన్నాయి. వాటిలో తెలుపు, నలుపు రంగుల్లో రెండు శునకాలు.. గోధుమ రంగులో రెండు కుక్కలున్నాయి. ఓ గులాబీ కలర్ బెలూన్ తో అవి ఆడుకుంటున్నాయి. ఆ బెలూన్ ను కింద పడకుండా ఆ శునకాలు గాల్లోకి ఎగిరి కొడుతున్నాయి. మనుషుల మాదిరిగానే ఒకదాని తర్వాత మరొకటి బెలూన్ ను ఆడుకుంటున్నాయి. 



ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఈ వీడియోకు ఇప్పటికే వేలాది వ్యూస్, లైక్స్ వచ్చాయి. మరికొంత మంది ఈ వీడియో చాలా ఆహ్లాదంగా ఉందంటూ కామెంట్ చేశారు. ఇంకొంత మంది నెటిజన్లు హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేస్తున్నారు.  


Also Read: Security For Mango: మామిడి పండుకు Z+ కేటగిరీ భద్రత.. కారణమేంటో తెలుసా?


Also Read: King Cobra: 12 అడుగులు పొడవున్న భయంకరమైన కళింగ సర్పాన్ని ఎప్పుడైనా చూశారా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook