Driving Tips: ఎందుకంటే కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ అంటే అంత సులభం కాదు. సాధారణ రోడ్లపై డ్రైవింగ్‌కు , పర్వత ప్రాంతాల్లో డ్రైవింగ్‌కు చాలా వ్యత్యాసముంటుంది. కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్‌కు చాలా అనుభవం ఉండాలి. పర్వత ప్రాంతాల్లో డ్రైవింగ్ అంటే థ్రిల్లింగ్ కూడా ఉంటుంది. పర్వత ప్రాంతాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. చాలా అప్రమత్తంగా ఉండాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పర్వత ప్రాంతాల్లో రోడ్లు సాధారణంగా ఇరుగ్గా, మలుపులతో ఉండటమే కాకుండా రోడ్లు పాడయి ఉంటాయి. అందుకే సాధ్యమైనంతవరకూ నెమ్మదిగా డ్రైవ్ చేయాలి. రోడ్డుని బట్టి కారు స్పీడ్ ఉండాలి. పర్వత ప్రాంతాల్లో డ్రైవింగ్ సమయంలో గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగం ఉండటం మంచిది. వేగం మంచిది కాదు. లేకపోతే నియంత్రణ కోల్పోయే ప్రమాదముంది.


అలసటగా ఉన్నప్పుడు సుదూర ప్రయాణాలు చేయకూడదు. ఏమాత్రం అలసినట్టుగా ఉన్నా ఎక్కడైనా ఆగి విశ్రాంతి తీసుకోవాలి. సాధారణంగా పర్వత ప్రాంతాల్లో వాతావరణం త్వరగా మారిపోతుంటుంది. మంచు కురుస్తున్నా లేక వర్షం పడుతున్నా ప్రయాణం మానుకోవాలి లేక నెమ్మదిగా ప్రయాణించాలి. 


కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు ఓవర్‌టేక్ అనేది చాలా ప్రమాదకరం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవర్‌టేక్‌కు ప్రయత్నించవద్దు. అంతగా చేయాలన్పిస్తే అన్ని జాగ్రత్తలు తీసుకుని సైడ్ ఇచ్చిన తరువాతే ఓవర్‌టేక్ చేయాలి. పర్వత ప్రాంతాల్లో ములుపులు ఎక్కువగా ఉంటాయి. హెయిర్ పిన్ బెండ్స్ అనేవి చాలా ప్రమాదకరం. అందుకే జాగ్రత్తగా ఉండాలి. 


పర్వత ప్రాంతాల్లో డ్రైవ్ చేసేటప్పుడు ఎదుటి వాహనంతో సమదూరంలో ఉండటం మంచిది. తరచూ హారన్ వినియోగించాలి. అదే రాత్రి సమయమైతే హెడ్ ల్యాంప్స్ డిమ్ చేస్తూ డ్రైవ్ చేయాలి. దీనివల్ల ఎదుటి వాహనాన్ని అప్రమత్తం చేసినట్టవుతుంది. 


Also read: Best 7 Seater Car: కేవలం 6 లక్షలకే బెస్ట్ 7 సీటర్ ఎంపీవీ కారు, ధర, ఫీచర్లు ఇలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook