Teacher Drinking Beer in Classroom: సినిమాల ప్రభావమో లేక మందెక్కువైన వేషాలో తెలియదు కానీ కొంతమంది టీచర్లు టీచర్లలా ప్రవర్తించడం లేదు. ఎవరి జీవితంలోనైనా తల్లిదండ్రుల తర్వాత మళ్లీ అంతటి బాధ్యత కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది చదువు చెప్పే గురువులే అని అంటుంటారు. కానీ అంతటి గురుతర బాధ్యత కలిగిన స్థానంలో ఉండి కూడా కొంతమంది ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తీసుకొస్తున్నారు. పిల్లలకు చదువు చెప్పే పవిత్ర దేవాలయం లాంటి పాఠశాలలోనే తిక్క వేషాలేస్తూ బాథ్యతతో ఉండే తోటి ఉపాధ్యాయులు తల దించుకునేలా చేస్తున్నారు. ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న స్కూల్ టీచర్ కూడా అలా తిక్క వేషాలు వేసే బ్యాచ్‌కి చెందిన టీచరే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వీడియోలో కనిపిస్తున్న స్కూల్ టీచర్ ఎదుట ఓ ఖాళీ బీర్ క్యాన్ కనిపిస్తుండగా.. తాను కూర్చున్న కుర్చీలోనే ఎవ్వరికీ కనపడకుండా మరో బీర్ క్యాన్ దాచిపెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఓ వ్యక్తి వీడియో తీస్తుండగా.. తన వెనకాలే ఉన్న బీర్ క్యాన్ ని దాచిపెట్టేందుకు ప్రయత్నించాడు కానీ అది కుదరలేదు. ఆ సమయంలో అతడు మద్యం మత్తులో ఉండటం, క్లాస్ రూమ్‌లో బీర్లు తాగుతుండటం వంటివి అతడి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పకనే చెబుతున్నాయి. అతడి ఎదురుగానే కింద విద్యార్థులు కూర్చుని ఉండటం  ఈ వీడియోలో చూడొచ్చు.



ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన బడి పంతులే ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తిసే.. ఇక ఆ పిల్లల భవిష్యత్ ఏం కాను అని స్వాతి మలివాల్ ఆవేదన వ్యక్తంచేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌కి చెందిన ఘటనగా తెలుస్తోంది అని తన ట్వీట్‌లో పేర్కొన్న ఆమె.. సదరు స్కూల్ టీచర్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉత్తర్ ప్రదేశ్ పోలీసులకు ట్యాగ్ చేశారు.


Also Read : Kissing Cobra Goes Wrong: నాగు పాముకు కిస్ ఇస్తుంటే సడెన్‌గా వెనక్కి తిరిగి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో


Also Read : Snakes Viral Video: బాబోయ్.. అంత పెద్ద పామును ఒంటి చేత్తో.. వీడు మామూలోడు కాదు..


Also Read : Rice, Salt in Mid-day Meal: అన్నం, ఉప్పుతోనే మధ్యాహ్న భోజనం.. ఇది కూడా ఒక తిండేనా!!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి