Dubai Millionaires Wife Demands Rupees 2.5 Crores: ప్రస్తుతం అమ్మాయిలకు ఒక రేంజ్ లో డిమాండ్ ఉంది. తమకు కాబోయే భర్త ఇలా ఉండాలి.. ఇంత ప్యాకేజీ, ప్రాపర్టీ ఇలా ఉండాలని యువతకులు ఒక మార్క్ పెట్టుకుంటున్నారు. దీనికి సరిపోయే వారిని మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు పెళ్లికావాలంటే అమ్మాయిలు చెప్తున్న ప్రతి కండీషన్ కు యువకులు ఓకే చెప్తున్నారు. కానీ కొందరు దీన్ని అవకాశంగా చేసుకుని కాస్తంతా అతిగా కూడా ప్రవర్తిస్తున్నారు. దీంతో యువతకు పెళ్లిళ్లు కాక, పెళ్లైన కూడా ఏదేదో మనస్పర్థలతో విడిపోతున్నారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూర్తి వివరాలు..


దుబాయ్ లో ఉండే ఒక మిలీయనీర్ భార్య, తన భర్త జమాల్ కు పెళ్లికి ముందే దిమ్మతిరిగే కండీషన్ లు పెట్టింది. ఈ కండీషన్ లన్నింటనికి ఒప్పుకున్నాక వీరి ఇద్దరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది.  పెళ్లి తర్వాత పిల్లలను కనాలంటే.. నెలకు రూ. 2.5 కోట్ల నెలవారీ భత్యం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. అంతేకాకుండా.. తన పేరుమీదుగా ప్రతినెల అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ చేయాలని తెల్చి చెప్పింది. తాను.. ఫ్రీగా ప్రెగ్నెంట్ పెయిన్స్ భరించడానికి సిద్ధంగా లేనని కూడా చెప్పింది. తన భర్త జమాల్ డబ్బులను ఖర్చులు చేయడం తనకు ఎంతో ఇష్టమని కూడా చెప్పింది.


పిల్లలు పుట్టాక తన కోసం లగ్జరీ గదిని ఏర్పటు చేయాలని, ఇప్పుడున్న పనివారికి రెట్టింపు పనివాళ్లను నియమించాలని తెల్చి చెప్పింది. అంతే కాకుండా.. పిల్లలు పుట్టిన తర్వాత శరీరంలో మొత్తం అలసిపోతుందని, అందుకే తనకు మసాజ్, బ్యూటిషియన్ లను, థెరపిస్టులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పింది.


Read More: Actress Kajal Agarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ నడుముపై చెయివేసిన అభిమాని.. సోషల్ మీడియాలో రచ్చగా మారిన వీడియో ఇదే..


ప్రత్యేకంగా మరుగు దొడ్లు, పిల్లలకు మసాజ్ లు, ఆంక్యూపంక్చర్ ఇలా అందరిని నియమించాలని కూడా చెప్పింది. తనకు రాత్రిపూట నిద్ర డిస్టర్బ్ కాకుండా.. ప్రత్యేకంగా నర్సులను కూడా నియమించాలనిచెప్పింది. ఒక వేళ మనకు ట్విన్స్ పుడితే.. ఈ చార్జీలు డబుల్ అవుతాయని కూడా తెల్చి చెప్పింది. డబ్బులు  డిపాజిట్ చేసిన కార్డుకు పూర్తిగా తనకే యాక్సిస్ ఉండాలని కూడా ఆమె చెప్పింది. ప్రస్తుతం ఈ మిలీయనీర్ భార్య కండీషన్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. ఇదేంటని ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారు.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter