Old two rupees coins and old two rupess notes: మీకు పాత నాణేలను సేకరించే హాబీ ఉందా ? మీ అభిరుచి మీకు ఆన్‌లైన్‌లో లక్షలు సంపాదించే మార్గాన్ని అందించే అవకాశం ఉంది. పాత నాణేలకు ఆన్‌లైన్ మార్కెట్‌లో చాలా డిమాండ్‌ ఉంది. పాత నాణేలు, పాత నోట్లు (Old coins, old notes) కొనడానికి కొంత మంది ఎంత డబ్బు అయినా ఖర్చు చేయడానికి వెనకడుగు వేయడం లేదు. అలాగే పాత 2 రూపాయల నాణెం ద్వారా లక్షలు సంపాదించే అవకాశం ఉందని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1994 సంవత్సరంలో తయారైన 2 రూపాయల నాణెం వెనుక మన జాతీయ జండా ఉంటుంది. Quickr వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ నాణెం ధర రూ. 5 లక్షలుగా నిర్ణయించినట్లు చూపించింది. మీరు చేయాల్సిందల్లా మీ వద్ద అలాంటి పాత నాణెం ఉన్నట్టయితే.. క్వికర్ వెబ్‌సైట్‌లో ఆ వివరాలు వెల్లడించడమే.


Also read : Govt jobs: CRPFలో పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు.. అర్హతలు, ఎంపిక విధానం


Quickr లో పాత 2 రూపాయల నాణెం ఎలా విక్రయించాలంటే...


Quickr.com లోకి లాగిన్ అవ్వండి. 
మీకు ఇప్పటికే ఖాతా లేకపోతే వెబ్‌సైట్‌లో మీ పేరు, వివరాలు నమోదు చేసుకుని లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోండి.
మీ వద్ద ఉన్న పాత నాణేల జాబితాను తయారు చేసి, వెబ్‌సైట్‌లో ఫోటోలను అప్‌లోడ్ చేయండి.
ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ద్వారా నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు.
ఆఫర్ చేసిన అత్యధిక ధరకు నాణెం (coins) గురించి చర్చలు జరిపి విక్రయించండి.    


స్వాతంత్య్రానికి ముందు విక్టోరియా రాణి ఫోటో ఉన్న ఒక్క రూపాయి వెండి నాణెం రూ .2 లక్షలకు అమ్ముడుపోయింది. అలాగే, జార్జ్ వి కింగ్ చక్రవర్తి 1918 చిత్రాన్ని కలిగి ఉన్న మరొక బ్రిటిష్ శకం నాణెం (Old coins) ధర రూ .9 లక్షలకు అమ్ముడుపోయింది. అంతేకాకుండా మీరు సేకరించిన పాత నాణేలను CoinBazzar website సేల్ చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా మీ పేరు, ఈమెయిల్, పూర్తి చిరునామా వంటి వివరాలను అందించడం ద్వారా వెబ్‌సైట్‌లో సైన్ అప్ చేయడమే.


Also read : Territorial Army Officer posts: ఇండియన్ ఆర్మీలో పోస్టుల భర్తీ, అర్హతలు, Salary, సెలెక్షన్ ప్రాసెస్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook