Ex and Current Girlfriend Engrossed in Alcohol Clashed for Boyfriend: "సోషల్ మీడియా".. వచ్చినప్పటీ నుండి వ్యక్తిగత అనేదే కరువయ్యాయి.. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగిన ఇట్టే అందరికి తేలిపోతుంది. రోజుకో వీడియో వైరల్ అవుతుంటాయి.. కొంత మంది అయితే లైకుల కోసం, ఫాలోవర్ల కోసమే వింత వింత పనులు చేస్తుంటారు.. అయితే ఈ రోజు ఒక వీడియో తెగ వైరలవుతుంది... అదేంటంటే.. ??


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తతే ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాజధాని లక్నోలోని (Lucknow) బరాబిర్వా చౌరస్తాలో స్కై హిల్టన్ హోటల్ & బార్ ఉంది.. అయితే ఆ బార్ ముందు ఇద్దరు అమ్మాయిలు మరో  అమ్మాయిని పట్టుకొనికొడుతున్నారు.. మొదటగా తాగిన మైకంలో కొట్టుకుంటున్నారులే అనుకున్నారు.. కానీ దెబ్బలు తిన్న అమ్మాయి ఆసుపత్రిలో చేరింది. ఈ విషయం కాస్త పోలీసుల వరకు చేరి.. అసలు సంగతి బయటపడింది 


Also Read: T20 World Cup 2021: భారత్ సెమీస్ చేరాలంటే.. ?? ముందున్న సవాళ్లు..!!


ఆ ఇద్దరు యువతులు కొట్టుకునేది.. ఒక యువకుడి గురించంట..!! దీనికి సంబందించిన వీడియో సొషల్ మీడియాలో పోస్ట్ చేయగానే తెగ వైరల్ అవుతుంది. ఒక యువకుడి మాజీ మరియు ప్రస్తుతం ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ బార్ బయట గొడవ పెట్టుకున్నారట. సోమవారం యువతి స్కై హిల్టన్ హోటల్ బార్ వద్దకు వచ్చి తన కారులో వచ్చి ఆడింగి. ఇంతలో అక్కడికి రాబిన్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు యువతులు కూడా అక్కడికి వచ్చారు. 



రాబిన్ తో వచ్చిన ఆ ఇద్దరి యువతులతో ఒకరు అతడి ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్.. రాబిన్ తన మొదటి గర్ల్ ఫ్రెండ్ తో విడిపోయాక మరో యువతితో డేటింగ్ లో ఉన్నాడంట.. అందుకే కారులో ఉన్న యువతి రాబిన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ ను ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ తన స్నేహితురాలితో దాడి చేసింది. మాజీ గర్ల్ ఫ్రెండ్ పరిస్థితి విషమించడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. 


Also Read: Warning to Mutton Buyers: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఆంత్రాక్స్‌.. మటన్ కొనే ముందు ఇవి చూడండి


గాయపడిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రాబిన్ తో పాటు అతడితో వచ్చిన ఇద్దరి యువతులపై కేసు నమోదయింది.ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. అక్టోబర్ 10వ తేదీన మాజీ గర్ల్ ఫ్రెండ్ ఇదివరకే రాబిన్ పై కేసు పెట్టిందట.. అందుకే ఈ ఇద్దరు యువతులు ఆ యువతిపై దాడి చేసిందని తెలుస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి