Warning to Mutton Buyers: ఆదివారం వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో మాంస ప్రియులకు మొదట గుర్తుకు వచ్చేది మటన్ మాసం.. లైన్లో వేచి ఉండి మరీ మటన్ తీసుకొస్తారు మన వాళ్లు.. కొంత మంది అయితే లైన్లో వేచి ఉండటం ఇష్టం లేక ఎన్నడూ లేని విధంగా కోడి కుయటానికి ముందే వెళ్లి మరీ మటన్ తెచ్చుకుంటారు.. మటన్ తినటం తప్పు కాదండి.. సరైన మాంసం తినకపోతేనే ప్రాణాంతకర సమస్యలొస్తాయి..
మటన్ ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఇటీవల మేకలకు, గొర్రెలకు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. కొంత మంది వీటి పట్ల ఆలోచన లేకుండా ఇష్టారీతిన మాంసాన్ని అమ్ముతున్నారు. ఇపుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే... కొత్తగా తెలుగు రాష్ట్రాల్లో గొర్రెలు, మేకల వలన ఆంత్రాక్స్ వ్యాధి (Anthrax) విజృంభిస్తోంది.
Also Read: Jr NTR: సంజయ్ లీలా భన్సాలీతో జూ. ఎన్టీఆర్ మూవీ..ఇక ఫ్యాన్స్ కు పండగే..!
కావున మీరు మటన్ కొనటానికి ముందు కొన్ని చెక్ చేయటం తప్పని సరి.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కట్ చేసిన మేకలను, గొర్రెలను పశువైద్యుడు పరిశీలించాడో లేదో తెలుసుకోవాలి.. నిజానికి అన్ని ప్రదేశాలలో పశువైద్యుడు వచ్చి చెక్ చేయటం సాధ్యపడదు.. అలాంటప్పుడు కట్ చేసిన గొర్రె లేదా మేక ప్రదేశాన్ని చెక్ చేయాలి.. ఎందుకంటే రక్తాన్ని బట్టి దానికి ఆంత్రాక్స్ సోకిందో తెలుసుకోవచ్చు.
కట్ చేసేప్పుడు మేక లేదా గొర్రె రక్తం గడ్డకట్టకుండా ద్రవరూపంలో ఉంటే మాత్రం వాటికి ఆంత్రాక్స్ సోకిందని అర్థం. ఒకవేళ రక్తం గడ్డలు కట్టినట్టు వస్తే మాత్రం అది ఆరోగ్యకరంగా ఉందని అర్థం. కావున మటన్ కొనే ముందు ఇవి చెక్ చేయండి, ఇలాంటి మాంసాన్ని అసలు అమ్మకూడదని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
Also Read: China Delta Variant: చైనాను వెంటాడుతున్న డెల్టా వేరియంట్, పెరుగుతున్న కేసులు
ఇక గ్రామాల విషయానికి వస్తే ఏదైనా గొర్రె లేదా మేక చనిపోతే.. ఎదో ఆరోగ్యం బాగోలేదని లేదా రోగం వచ్చి చనిపోయిందని ఎవరికైన విక్రయిస్తారు లేదా వల్లే వండుకొని తినేస్తారు.. ఇలా చేస్తే చాలా ప్రమాదకరం. మేకలు, గొర్రెలు చనిపోతే... వెంటనే దగ్గర్లో ఉన్న ప్రభుత్వ అధికారులను కలిసి చనిపోయిన కారణం తెలుసుకోవరం ద్వారా ఆంత్రాక్స్ వ్యాధి విస్తరణను ఆపవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook