Facebook: జపాన్‌లో ఫేస్‌బుక్‌కు ఎదురుదెబ్బ, పింట్రెస్ట్‌కు పెరుగుతున్న ఆదరణ
Facebook: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు ఆ రెండు దేశాల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌దే అగ్రస్థానం. అయితే ఆ రెండు దేశాల్లో మాత్రం ఎదురుదెబ్బే తగిలింది.
Facebook: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు ఆ రెండు దేశాల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌దే అగ్రస్థానం. అయితే ఆ రెండు దేశాల్లో మాత్రం ఎదురుదెబ్బే తగిలింది.
ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఫేస్‌బుక్ అంటే తెలియనివారు లేరు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఫేస్‌బుక్ తప్పనిసరిగా వాడుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఫేస్‌బుక్‌పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆ కారణంగా యూజర్లు తగ్గుతున్న పరిస్థితి ఎదురవుతోంది. అదే క్రమంలో జపాన్, ఉగాండా దేశాల్లో ఫేస్‌బుక్‌కు ఆదరణ తగ్గుతోంది. ముఖ్యంగా జపాన్ దేశంలో ఇంటర్నెట్ యూజర్లు ఫేస్‌బుక్‌కు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఎందుకంటే 2017 చివరి నుంచి ఫేస్‌బుక్ మార్కెట్ జపాన్ దేశంలో తగ్గుతూ వస్తోంది. ఇదంతా ఫీడ్‌బ్యాక్, కామెంట్ల ద్వారా తెలుస్తోంది. అయితే ఇదేమీ ఫేస్‌బుక్‌కు ఆందోళన కల్గించడం లేదు. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌కు మాత్రం ఆదరణ పెరుగుతోంది.
ఇక ఉగాండాలో కూడా అదే పరిస్థితి. ఫేస్‌బుక్ (Facebook)పట్ల వ్యతిరేకత క్రమంగా పెరుగుతూ వస్తోంది. కారణమేంటనేది తెలియడం లేదు. ఇక వెనిజులాలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఈ దేశంలో ట్విట్టర్, ఫేస్‌బుక్ పోటాపోటీగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 72.4 శాతం ట్రాఫిక్ కూడా తగ్గిపోయింది. తరువాతి స్థానంలో ట్విట్టర్ 8.8 శాతంతో నిలిచింది. పింట్రెస్ట్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, రెడ్జిట్, టంబ్లర్ వంటివి తరువాతి స్థానాల్లో ఉన్నాయి. పింట్రెస్ట్‌కు ఆదరణ పెరుగుతుండటం విశేషం. జపాన్‌లో ట్విట్టర్ షేర్ 48.65 శాతం యూజర్లు ఉన్నారు. రెండవ స్థానంలో పింట్రెస్ట్ నిలిచింది. ఇక ఫేస్‌బుక్ మాత్రం కేవలం 16 శాతం వాటాతో ఉంది. ఉగాండాలో కూడా పింట్రెస్ట్ (Pinterest)రెండవ స్థానంలో నిలిచింది.
Also read: Pig Heart Surgery: వైద్య చరిత్రలో అద్భుత పరిణామం- మనిషికి పంది గుండె అమర్చి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి