Lion Vs Farmer Video: ప్రాణాలకు తెగించి పులి నోటి నుంచి ఆవును రక్షించిన రైతు
Lion Vs Cow Vs Farmer Video: సింహంతో ఒంటరిగా పోరాడాలంటేనే ఎన్నో గుండెలు ఉండాలి అంటారు. అలాంటిది బాగా ఆకలితో ఉన్న సింహానికే ఎదురెళ్లాడు ఓ రైతు. ఆకలితో ఉన్న ఓ సింహం ఆవును వేటాడి అడవిలోకి లాక్కెళ్లుతుండగా అప్పుడు వచ్చాడయ్యా రైతు ఆ ఆవు పాలిట దేవుడిలా.. తన చేత ఏ ఆయుధం లేకున్నా.. తన ధైర్యాన్నే ఆయుధంగా మలిచి సింహాన్ని ఎదురించడానికి ఒంటరిగా ముందడుగేశాడు.
Lion Vs Cow Vs Farmer Video: అప్పటికే సింహం నోటికి చిక్కిన ఆవు ప్రాణాల కోసం గిలగిల కొట్టుకుంటోంది. సింహం కూడా తన బలాన్ని అంతా ఉపయోగించి ఆ ఆవును అడవిలోకి లాక్కెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆ సమయంలోనే రైతు వచ్చి సింహాన్ని తరిమికొట్టే ప్రయత్నం చేస్తుండటం ఈ వీడియోలో చూడవచ్చు. ఆకలి మీదున్న తనను డిస్టర్బ్ చేస్తున్నందుకు కోపంతో ఆ సింహం తల్చుకుంటే అది ఆ ఆవును విడిచిపెట్టి కోపంతో అతడిపై పంజా విసిరే ప్రమాదం ఉంది. కానీ అవేమీ అతడిని భయపెట్టలేదు. అతడు అంత దూరం కూడా ఆలోచించలేదు. అతడి కళ్ల ముందున్న ఏకైక లక్ష్యం ఆ సింహం కోరల్లోంచి ఆ ఆవుని కాపాడటమే. అందుకే తన చేతుల్లో ఏ ఆయుధం లేకున్నా ఏదో ఉన్నట్టు ముందుడుగేశాడు.
ఇదంతా నడి రోడ్డుపైనే జరుగుతోంది. అప్పుడే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన కిరిత్‌సిన్హ్ చౌహాన్ అనే రైతు ధైర్యంగా సింహాన్ని తరిమికొట్టేందుకు ముందడుగేశాడు. అతడి ధైర్యాన్ని చూసి ఆ సింహమే భయపడింది. అతడు చేత్తో ఏదో రాయి లాంటి దాన్ని పట్టుకుని ఆ సింహం వైపు బలంగా విసిరినట్టుగా చేయిలేపాడు. అంతే.. ఆ సింహం ఆవును అక్కడే వదిలేసి అడవిలోకి పరుగెత్తింది.
సింహం ఆవును నోట కర్చుకుని తినేందుకు సిద్ధమవుతుండగా అవతలి వైపు నుంచి రైతు వచ్చి కాపాడటం మొత్తం దృశ్యాన్ని ఇవతలి వైపు కారులో కూర్చున్న వాళ్లు వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని జునాగఢ్‌లోని కేషోడ్ కార్పొరేటర్ వివేక్ కొటాడియా ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా.. ఈ వీడియో చూసిన నెటిజెన్స్.. ఆ రైతు సాహసానికి సాహో అని కితాబిస్తున్నారు. ఈడు అసలైన మగాడ్ర బుజ్జి అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
ఇది కూడా చదవండి : Lion Vs Farmer Video: ప్రాణాలకు తెగించి పులి నోటి నుంచి ఆవును రక్షించిన రైతు
వాస్తవానికి అతడి ధైర్యాన్ని ఎలా పొగిడినా తక్కువే అవుతుంది మరి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో కింద చాలా మంది నెటిజెన్స్ చాలా రకాలు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఒక యూజర్ ఇచ్చిన కాంప్లిమెంట్ మాత్రం ఫుల్ హైలైట్ అవుతోంది. నిజమైన సింహం నాలుగు కాళ్లపై కాదు.. రెండు కాళ్లపైనే నడుస్తోంది అని ఒక యూజర్ ప్రశంసించాడు.. అంటే సింహం అది కాదు.. ఆ రైతేననేది అతడి భావన. ఏదేమైనా రైతు ధైర్యాన్ని నిజంగా మెచ్చుకుని తీరాల్సిందే. పశువులంటే ప్రాణం అంటే అసలైన అర్థం ఇదే కదా..
ఇది కూడా చదవండి : Too Many Snakes in Open Well: బావి నిండి భయంకరమైన నాగుపాములు, రక్త పింజర్లు.. ఎంత తెలివిగా పట్టాడో చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK