Mutton Maggi Recipes: మ్యాగీ మటన్ ఎప్పుడైనా ట్రై చేశారా ? లేదంటే ఇదిగో

Mutton Maggi recipes: ఇండియాలో బాగా ప్రాచుర్యం ఉన్న ఇన్‌స్టాంట్ ఫేమస్ స్నాక్స్ జాబితాలో మ్యాగీ ముందు వరుసలో ముందుంటుంది. ఎవరు ఔనన్నా.. ఎవరు కాదన్నా.. మ్యాగికి మన దేశవ్యాప్తంగా మంచి ఆధరణ ఉంది అనే విషయం తెలిసిందే. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2023, 05:31 PM IST
Mutton Maggi Recipes: మ్యాగీ మటన్ ఎప్పుడైనా ట్రై చేశారా ? లేదంటే ఇదిగో

Mutton Maggi recipes: ఇండియాలో బాగా ప్రాచుర్యం ఉన్న ఇన్‌స్టాంట్ ఫేమస్ స్నాక్స్ జాబితాలో మ్యాగీ ముందు వరుసలో ముందుంటుంది. ఎవరు ఔనన్నా.. ఎవరు కాదన్నా.. మ్యాగికి మన దేశవ్యాప్తంగా మంచి ఆధరణ ఉంది. కన్యాకుమారిలో రోడ్డు పక్కన ఛాయ అమ్మే టీ స్టాల్ వాళ్ల నుండి జమ్మూ, కశ్మీర్, లేహ్‌లో ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఉండే రెస్టారెంట్ల వరకు ప్రతీచోటా లభించే కామన్ ఫుడ్ ఐటం ఏదైనా ఉందా అంటే ఈ మ్యాగీనే అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. 

హాస్టళ్లలో నివసించే విద్యార్థులకు అయితే మ్యాగీ మరింత ఇష్టం. హాస్టల్లో ఫుడ్ రుచికరంగా అయినిపించకపోయినా.. నచ్చిన మెనూ లేకపోయినా.. వారికి వెంటనే తట్టే ఆలోచన మ్యాగీ. అలాగే స్కూల్‌కి వెళ్లే పిల్లలు ఉన్న తల్లికి తన పిల్లలకు వీలైనంత త్వరగా రుచికరమైన స్నాక్స్ చేసి పెట్టాలంటే, వెంటనే వారి కళ్ల ముందు కనిపించేది  ఈ మ్యాగీనే. అలా మ్యాగీ భారతీయ కుటుంబాల్లో ఎప్పుడో ఒక భాగమైపోయింది.

జస్ట్ రెండంటే రెండే నిమిషాల వ్యవధిలో రెడీ అయ్యే మ్యాగీతో మనందరికీ చిన్నప్పటి నుంచి మంచి మంచి జ్ఞాపకాలే ఉన్నాయి. కదా ఆ మాటకొస్తే.. పెద్దా, చిన్నా అని తేడా లేకుండా అన్ని వయస్సుల వారు కూడా నూడుల్స్‌ని లైక్ చేస్తారు. ఇష్టంగా తింటారు. ఇక్కడ చెప్పుకోదగిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మ్యాగీని తయారు చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.. కొంతమంది వెజ్ నూడుల్స్ తినడానికి ఇష్టపడతారు.. కొంత మంది నాన్ వెజ్ నూడుల్స్ తినడానికి ఇష్టపడుతుంటారు. వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా.. అందులోనూ మళ్లీ వేర్వేరు వెరైటీ వంటకాలు ట్రై చేస్తుంటారు. 

ముఖ్యంగా వీధుల్లో నూడుల్స్‌తో రకరకాల పేర్లు పెట్టి ఇన్‌స్టాంట్ స్నాక్స్ కింద అమ్మేస్తుంటారు. ' పరాటా మ్యాగీ ', ' పిజ్జా మ్యాగీ ' , ' విస్కీ మ్యాగీ ' పేర్లతో బిజినెస్ చేస్తూ నూడుల్స్ రెపిసిలీను, వాటికి ఉండే రుచిని నాశనం చేస్తుంటారు. ఇదిగో తాజాగా అలాంటి వంటకమే మరొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈసారి ఈ స్ట్రీట్ ఫుడ్ వెండాప్ ఈ రెసిపికి పెట్టిన పేరు 'మటన్ మ్యాగీ'. మటన్ మ్యాగీ ఏంటి అనుకుంటున్నారా ? అయితే, ఇదిగో ఈ వీడియే చూసేయండి.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Dua (@dilsefoodie)

ఇది కూడా చదవండి : Colours Changing Car: ఊసరవెల్లిలా రంగులు మార్చే కారు.. క్షణంలో మారిపోయే కలర్.. వీడియో వైరల్

ఒక వీధి వ్యాపారి మ్యాగీ ప్యాకెట్‌ని చించి, మటన్ గ్రేవీలో యాడ్ చేయడం ఈ వీడియోలో చూడవచ్చు. ఒక పెద్ద గిన్నెలోంచి కొన్ని మటన్ పీసెస్ తీసుకుని మ్యాగీలో కలిపాడు. అలా కాసేపు అటు, ఇటు ఫ్రై చేసిన అనంతరం ఆ వంటకాన్ని కస్టమర్‌కి వడ్డించాడు. ఫుడ్ బ్లాగర్ అయిన @dilsefoodie ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ఈ వైరల్ వీడియోకు భారీ స్పందన కనిపిస్తోంది. మటన్‌తో మ్యాగీ ఏంట్రా బాబూ అంటూ నెటిజెన్స్ తమదైన స్టైల్లో కామెంట్స్ రాస్తున్నారు. 

ఇది కూడా చదవండి : Boss Vs Employee: పెళ్లి కాలేదని వీక్ ఆఫ్ రోజు డ్యూటీకి రమ్మన్నాడు.. ఉద్యోగి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు

ఇది కూడా చదవండి : Hotel Waiter To IAS Officer: హోటల్లో వెయిటర్‌గా పనిచేసుకుంటూ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News