Fish DCM Accident: ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని వనపర్తి జిల్లా అడ్డాకుల వద్ద సోమవారం రాత్రిపూట చేపల లోడుతో డీసీఎం వెళ్తుంది. అదుపు తప్పి చేపల డీసీఎం బోల్తా పడింది. పక్కకు ఒరగడంతో క్రేన్‌లలో కొన్ని లక్షల విలువైన మత్య్స సంపద రోడ్డుపాలైంది. రోడ్డుపై ఎదురుగా వస్తున్న మరో డీసీఎమ్‌ను ఢీకొనడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. చలికాలం కావడంతో రోడ్డు సరిగ్గా కనిపించక ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Most Wanted Escape Prison: జైలు నుంచి మాఫియా కింగ్‌ పరార్‌.. ఎలా అనేది వింటే మీరు పరేషాన్‌ అవుతారు


డీసీఎం బోల్తా పడడంతో అందులోని చేపలన్నీ బయటపడ్డాయి. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయి రోడ్డంతా చేపల వర్షం కురిసినట్టు కనిపించింది. రోడ్డుపై పడడంతో చేపలు విలవిలలాడాయి. ప్రాణంతో అవి కొట్టుమిట్టాడుతున్నాయి. ఆ డీసీఎంలో రకరకాల చేపలు ఉన్నాయి. అందులో అత్యధికంగా క్యాట్‌ ఫిష్‌, కొర్రమీను తదితర చేపలు ఉన్నాయి. అయితే వాహనాలు ఆగకుండా చేపలపై నుంచే వాహనాలు ముందుకు కదిలాయి. దీంతో చేపలు చనిపోయాయి. బస్సులు, లారీలు, కార్లు చేపలపై నుంచే రాకపోకలు సాగించడం కలవరపరిచింది. కాగా మరికొందరు, సమీప గ్రామాల ప్రజలు రోడ్డుపైకి చేపలను పట్టుకుని సంచుల్లో వేసుకున్నారు. చేపలను తమ ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 


Also Read: King Cobra Vs Stray Dogs: కుక్కలే గుంపులుగా వస్తే సింగిల్‌గా దిగిన పాము గెలిచిందా? ఓడిందా?


సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బందితో కలిసి చేపలను పక్కను నెట్టేసి వాహనాల రాకపోకలను కొనసాగించారు. అనంతరం ఢీకొన్న డీసీఎం, లారీలను రోడ్డుపై నుంచి పక్కకు జరిపించారు. ప్రమాదం ధాటికి డీసీఎం ముందు భాగం పూర్తిగా నుజ్జనుజ్జయ్యింది. అయితే అదృష్టవశాత్తు ప్రాణాపాయం సంభవించలేదు. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఆరా తీస్తున్నారు. కాగా డీసీఎం బోల్తాతో చేపలు పడిపోవడంతో రూ.లక్షల్లో నష్టం సంభవించిందని బాధిత యజమాని వాపోయాడు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook