Flying Car Video: పక్షిలా గాల్లోకి తుర్రున ఎగిరే కారును ఎప్పుడైనా చూశారా?
Flying Car Video: గాల్లో ఎగిరే విమానం లేదా హెలికాప్టర్ చూసుంటారు. కానీ, గాల్లో ఎగిరే కారును ఎప్పుడైనా లైవ్ లో చూశారా? అయితే ఈ వీడియో చూడండి. ఓ కారు రోడ్డుపై వెళ్తూనే గాల్లోకి పక్షిలాగా తుర్రున ఎగిరింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.
Flying Car Video: సోషల్ మీడియా నిత్యం అనేక వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు చూసిన తర్వాత మీ కళ్లను మీరే నమ్మలేరు. అది నిజమా? కాదా? అని తెలుసుకునేందుకు ఆ వీడియోను పదే పదే చూసిన సందర్భాలు ఉండే ఉంటాయి. కానీ, అలాంటి వీడియోలలో చాలా వరకు ఎడిట్ చేసినవే కావడం గమనార్హం. అది ఎడిట్ చేసిన వీడియో అని చాలా సార్లు చూసిన తర్వాత మీరు గమనిస్తారు.
అయితే అలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఓ కారు రోడ్డుపై వెళ్తూనే.. సడెన్ గా గాల్లోకి ఎగిరింది. అది చూసిన నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు. అసలు ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దాం.
ఏం జరిగిందంటే?
సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారిన ఓ వీడియోలో కారు పక్షిలా గాల్లోకి ఎగిరింది. ఆ వీడియో తొలుత కారు నడుపుతున్న వ్యక్తి కెమెరాను చూస్తూ ఏదా మాట్లాడుతాడు. ఆ కారును తీసుకొని రోడ్డుపై నడుపుకొంటూ ముందుకెళ్తాడు. హటాత్తుగా ఆ కారు డోర్లు పక్షి రెక్కల్లా పక్కకు విచ్చుకున్నాయి. ఆ తర్వాత కారు కొద్ది ఎత్తుకు గాల్లోకి లేచి.. పక్షిలాగా ఎగురుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియోను వెనుక నుంచి కారులో వస్తున్న మరో వ్యక్తి తన మొబైల్ లో క్యాప్చర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం గూగుల్ లో ట్రెండ్ అవుతుంది. దాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
కారు గాల్లోకి ఎగరడమెలా సాధ్యమంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అందుకు ఎవరి దగ్గర సమాధానం లేదు.. దానికి ఆన్సర్ లేదు కూడా! గాల్లోకి ఎగిరిన కారును ప్రముఖ పాప్ సింగర్ సైరస్ డోబ్రే నడుపుతున్నాడు. ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు 'బ్యాక్ టూ ది ఫ్యూచర్' అనే క్యాప్షన్ తో వీడియో షేర్ చేశాడు. ఇప్పటి వరకు 30 వేల మందికి పైగా లైకులు చేశారు. లక్షల్లో వ్యూస్ లభిస్తున్నాయి. వేల మంది ఈ వీడియోను షేర్ చేసేస్తున్నారు.
Also Read: Viral Videos: సింహం నోట్లోంచి తప్పించుకునేందుకు నీళ్లలో దూకింది.. కానీ ఇంతలోనే..
Also Read: Snake Vs Rabbit Video: పాముతో యుద్ధానికి తలపడిన కుందేలు.. చివరికి ఏం జరిగిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook