Snake Vs Rabbit Video: పాముతో యుద్ధానికి తలపడిన కుందేలు.. చివరికి ఏం జరిగిందంటే?

Snake Vs Rabbit Video: ఎక్కడైన పాము మన కంటబడితే వెంటనే భయానికి లోనవుతుంటాము. కానీ, ఓ కుందేలు మాత్రం పాముతో ఏకంగా యుద్ధానికి దిగింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ యుద్ధంలో ఎవరు గెలిచారో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే!  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 15, 2022, 11:33 AM IST
Snake Vs Rabbit Video: పాముతో యుద్ధానికి తలపడిన కుందేలు.. చివరికి ఏం జరిగిందంటే?

Snake Vs Rabbit Video: సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త సమాచారం ట్రెండ్ అవుతుంది. అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులోనూ ముఖ్యంగా జంతువులకు సంబంధించిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంటాయి. జంతువులకు సంబంధిన ఫన్నీ వీడియోస్ తో పాటు ఫైటింగ్, వేటాడే వీడియోలు ఇలా చాలానే వైరల్ అవుతున్నాయి. కొన్ని మనల్ని నవ్వించినా.. మరికొన్ని షాక్ లోకి నెట్టివేస్తున్నాయి. అలాంటి ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

పామును చూస్తే మనుషులకే కాకుండా అనేక జంతువులకు భయం తప్పుదు. కానీ, సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న వీడియోలో మాత్రం ఓ పాముకు కుందేలు భయపడడం లేదు. నిర్భయంగా పాము ఎదురుగా కొట్లాడుతుంది. ఈ క్రమంలో పాము, కుందేలు మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏం జరిగిందో చూద్దాం. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by طبیعت (@nature27_12)

ఏం జరిగిందంటే?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ప్రకారం.. ఓ పార్కులో పాము కనిపించింది. మొదట పక్కనే ఉన్న కుందేలును ఏమి చేయకుండా.. పాము వెళుతుంది. కానీ, కుందేలు ఆ పాముపై దాడికి తెగబడింది. అంతే వెంటనే కోపం తెచ్చుకున్న పాము కుందేలుపై ప్రతిదాడి చేసింది. దాని నుంచి తప్పించుకునేందుకు కుందేలు పైకి ఎగిరింది. చివరికి ఆ పాము కుందేలను కాటు వేసింది. 

పాము, కుందేలుకు సంబంధించిన ఈ ఫైటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ అయిన ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ వీడియోకు వేలల్లో లైక్ లు, షేర్స్ వస్తున్నాయి.  

Also Read: Child Swallowed Battery: 5 సెం.మీ బ్యాటరీని మింగేసిన చిన్నారి.. 14 గంటలు కష్టపడ్డ డాక్టర్లు!

Also Read: Korean Girl Srivalli Dance: అల్లు అర్జున్ ను కాపీ కొట్టిన కొరియన్ బ్యూటీ- శ్రీవల్లీ డ్యాన్స్ వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News