Peocock Viral Video: పక్షుల్లో అందమైనది.. సొగసైనది.. తన అందచందాలతో అడవికే అందం తీసుకొచ్చే పక్షి ఏదైనా ఉందంటే మన జాతీయ పక్షి నెమలి. లేలేత నీలి రంగులో మెరుస్తూ అందరినీ ఆకర్షించే నెమళ్లను చూడడానికి రెండు కళ్లు చాలవు. ప్రకృతి పరవశించిన వేళ నెమలి నృత్యం చూడాలంటే అదృష్టం ఉండాలి. ఇక నెమలి తన పింఛాన్ని పురివిప్పినప్పుడు చూస్తే ఎన్నిసార్లు చూసినా తనివితీరదు. అలాంటి నెమలి అందంగా.. సొంపుగా రివ్వున చెట్టుపైకి ఎగురుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. నెమలి రెక్కలు విప్పుకుంటూ ఎగురుతున్న దృశ్యాన్ని ఓ ఫొటోగ్రాఫర్‌ తన కెమెరాలో బంధించారు. ఆ వీడియో చూసేయండి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Red King Kobra: ఎరుపు రంగులో నాగుపాము వయ్యారాలు.. చూస్తే మతిపోతది



హర్ష నరసింహమూర్తి అనే వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ తరచూ అటవీ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధిస్తుంటాడు. అందులో భాగంగా ఓ అడవిలో తిరుగుతుండగా అతడి కళ్ల ముందు నుంచే నెమలి రివ్వున ఎగురుకుంటూ చెట్టు కొమ్మపై వాలింది. వెంటనే ఆ దృశ్యాలను నరసింహమూర్తి తన కెమెరాలో చిత్రీకరించాడు.

Also Read: Bengaluru Ambulance: ఫ్లైఓవర్‌పై అంబులెన్స్‌ బీభత్సం.. అచ్చం సినిమాలో చూసినట్టే దృశ్యాలు


ఓ అడవిలో ఉన్న బాటలో నెమళ్లు సంచరిస్తున్నాయి. మొత్తం మూడు నెమళ్లు ఉండగా.. రెండు ఒకచోట ఉన్నాయి. ఒక నెమలి ఆహారం కోసం అన్వేషిస్తూ నడుచుకుంటూ వెళ్తుండగా మరో నెమలి మాత్రం అనూహ్యంగా పైకి ఎగిరింది. ఎగురుతున్న సమయంలో ఆ నెమలి అందం చూడముచ్చటగా ఉంది. పొడవైన పింఛం.. అందమైన రెక్కలతో ఎగురుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉన్నాయి. ఒక దేవకన్యలా ఆకాశంలోకి ఎగురుతూ ఉన్న నెమలి వీడియోను ఫొటోగ్రాఫర్‌ తన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. 


జాతీయ పక్షి వీడియోను నెటిజన్లు చూసి ముచ్చటపడుతున్నారు. 'నా అందం చూడండి అంటూ నెమలి ఎగురుకుంటూ వెళ్తోంది' అని కొందరు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు అంత ఎత్తున ఉన్న చెట్టు కొమ్మపైకి నెమలి ఎలా ఎగిరిందా అని ప్రశ్నించుకుంటున్నారు. అందమైన వీడియో తీసి మాకు అందించినందుకు కృతజ్ఞతలు అని కొందరు చెబుతున్నారు. ఈ వీడియోకు సంబంధించిన ట్వీట్‌ వేలకొద్ది రీట్వీట్లు జరిగింది. లక్షల సంఖ్యలో నెటిజన్లు వీక్షించారు.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook