Delivery Man Caught Spitting On Food: ఇటీవల కాలంలో ఫుడ్ డెలివరీ యాప్స్ మనకు తెలియకుండానే మన జీవితంలో ఒక భాగమైపోయాయి. అలాగని చెప్పి మనం ఆర్డర్ చేసిన ఆహారం నాణ్యత విషయంలో మనం రాజీపడం కదా.. ఆ ఫుడ్ చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణంలో వండి, శుభ్రంగా ప్యాక్ చేసి, అంతే శుభ్రంగా, వేడిగా మనకు అందించాలి అనే కదా ఎవరైనా కోరుకునేది. కానీ డోర్ డెలివరి చేసిన ఫుడ్ అలా కాకుండా ఫుడ్ పార్సిల్ పై ఉమ్మివేసి ఉంటే ఎవరికి మాత్రం నచ్చుతుంది చెప్పండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయినా అలా ఆహారం పార్సిల్ పై ఉమ్మి వేసేంత దుర్మార్గులు ఉంటారా ? అలా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది ? ఎందుకు ఉంటుంది ? అనే కదా మీ బుర్రని తొలిచేస్తోన్న సందేహం. ఆగండి ఆగండి.. మీకు ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే మీరు మరింత షాక్ అవుతారు. ఎందుకంటే ఆ ఫుడ్ పార్సిల్ పై ఉమ్మివేసింది ఇంకెవరో కాదు.. ఫుడ్ డెలివరి చేసిన వ్యక్తే. ఔను.. ఫ్లోరిడాలో ఒకరికి నిజంగానే అలాంటి చేదు అనుభవం ఎదురైంది. 


తాజాగా ఫ్లోరిడాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఒక 13 ఏళ్ల బాలుడు ఎలియాస్ క్రిసాంటో, అతడి తల్లి డోర్‌డాష్ నుండి ఫుడ్ ఆర్డర్ చేశారు. ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి వచ్చి ఫుడ్ పార్కిల్ అక్కడ పెట్టి దానిని ఒక ఫోటో తీసుకున్నాడు. ఆ తరువాత అదే ఫుడ్ పార్సిల్‌ రెండు, మూడు సార్లు ఉమ్మేశాడు. అందుకు కారణం ఆ ఫుడ్ ఆర్డర్ చేసిన వాళ్లు తనకు కనీసం ఒక్క డాలర్ టిప్పు కూడా ఇవ్వలేదనే కోపంతోనే అతను తన కస్టమర్ కి డెలివరి చేసిన ఆహారంపై ఉమ్మివేశానని ఆ తరువాత తన తప్పిదాన్ని అంగీకరించాడు. 



 


ఆ డెలివరి ఏజెంట్ ఏమనుకున్నాడంటే.. ఎలాగూ తను ఫుడ్ డెలివరి ఫోటోలు తీసుకున్నాను కనుక ఆ ఫుడ్ పై ఉమ్మివేసింది ఎవరో తనకు తెలియదు.. తను మాత్రం పరిశుభ్రంగానే డెలివరి చేశానని.. కావాలంటే ఇదిగో తన వద్ద ఫోటోలు కూడా ఆధారంగా ఉన్నాయి చూడండి అని చెప్పొచ్చు అని భావించాడు. కానీ ఆ ఇంటి ఆవరణలో హిడెన్ సీసీటీవీ కెమెరా ఉంది అనే విషయం సదరు వ్యక్తి తెలుసుకోలేకపోయాడు. కానీ ఈ అతడి బాగోతం అంతా ఆ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవడంతో అతడు తన తప్పిదాన్ని ఒప్పుకోక తప్పలేదు. 


ఇది కూడా చదవండి : Monkey Funny Viral Video: హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్‌లో రచ్చ రచ్చ చేసిన కోతి ..చివరికి ఏం జరిగిందో మీరే చూడండి!  


ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫుడ్ డెలివరి బాయ్స్‌కి టిప్ ఇవ్వకపోతే మరీ ఇంత వైల్డ్ రియాక్ట్ అవడం ఎంత వరకు న్యాయం అని ఈ వీడియో చూసిన నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన డోర్‌డాష్ సంస్థ కస్టమర్‌కి క్షమాపణలు చెప్పడమే కాకుండా ఆ డెలివరి పర్సన్‌ని ఉద్యోగంలోంచి తీసేస్తున్నాం అని ప్రకటించింది.


ఇది కూడా చదవండి : Red Wine Flowing In Streets: కంపెనీలో స్టోరేజ్ ట్యాంకులు పగిలి రోడ్లపై పొంగిపొర్లిన రెడ్ వైన్.. వీడియో వైరల్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి