Monkey Funny Viral Video: హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్‌లో రచ్చ రచ్చ చేసిన కోతి ..చివరికి ఏం జరిగిందో మీరే చూడండి!

Monkey Funny Viral Video: ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లోకి కోతి చొరబడింది. దీనిని వీడియో తీసి ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మీరు కూడా ఈ వీడియో చూడకపోతే ఇప్పుడే చూడండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 13, 2023, 09:33 PM IST
Monkey Funny Viral Video: హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్‌లో రచ్చ రచ్చ చేసిన కోతి ..చివరికి ఏం జరిగిందో మీరే చూడండి!

Monkey Funny Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వేగంగా వైరల్ అవుతున్నాయి. అడవుల్లో సింహాలు జింకలను వేటాడడం, గర్జించే వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఆ తర్వాతే ఇతర కేటగిరీలకు సంబంధించిన వీడియోలు దర్శనమిస్తాయి. ప్రస్తుతం నెట్టింట్లో ఓ కోతికి సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన వారంతా ఎంతో నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఈ వీడియోలు కోతి ఏం చేసింది? అసలు ఈ వీడియోలో సన్నివేశాలు ఎక్కడ చిత్రీకరించారు? అన్న అన్ని క్వశ్చన్స్ కి మనం ఇప్పుడు సమాధానం తెలుసుకోబోతున్నాం..

వీడియో వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలోని ప్రముఖ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లోకి ఓ కోతి ఒక్కసారిగా దూసుకెళ్లింది. అయితే వెంబటే దీనిని గమనించిన వైద్యులు ఆ కోతిని బయటికి తరిమికొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కోతి ఏమాత్రం భయపడకుండా అక్కడే కొద్ది నిమిషాల పాటు అటు ఇటు తిరిగింది. ఇక వైద్యులు కోతి చేస్తున్న చేష్టాలను భరించలేక కోతిని ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో తీగ వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తపరుస్తున్నారు. 

ఇది కూడా చదవండి : Red Wine Flowing In Streets: కంపెనీలో స్టోరేజ్ ట్యాంకులు పగిలి రోడ్లపై పొంగిపొర్లిన రెడ్ వైన్.. వీడియో వైరల్

అయితే చాలామందికి వచ్చిన డౌట్ ఏమిటంటే.? ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎంతోమంది సెక్యూరిటీ గార్డులు పని చేస్తారు. కానీ ఈ కోతి వారిని దాటుకొని ఆపరేషన్ థియేటర్లోకి రావడం వల్ల.. అక్కడ పనిచేసే సెక్యూరిటీల పనితనం గురించి కామెంట్లలో నెగిటివ్‌గా మాట్లాడుతున్నారు. మరో విషయం ఏమిటంటే ఆపరేషన్ థియేటర్లో ఒక పేషెంట్ కూడా ఉన్నాడు..అతనిపై కోతి ఏమాత్రం దాడి చేయకుండా ఉండడానికి ఓ వైద్యుడు స్టిక్ పట్టుకొని బెదిరించడం మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఏది ఏమైనా ఇలా ఆపరేషన్ థియేటర్లోకి కోతి రావడం హాస్పిటల్ కే అవమానమని సోషల్ మీడియా వినియోగదారులు అంటున్నారు. ఇప్పటికీ ఈ సంఘటనపై హాస్పిటల్ యాజమాన్యం స్పందించకపోవడం మరింత ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇది కూడా చదవండి : Red Wine Flowing In Streets: కంపెనీలో స్టోరేజ్ ట్యాంకులు పగిలి రోడ్లపై పొంగిపొర్లిన రెడ్ వైన్.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News