Leopard Killed: ఇంట్లోకి దూరిన పులి.. కర్కశత్వంతో బూట్లతో తన్ని చంపేసిన అధికారులు
Forest Department Kills Leopard: అడవి నుంచి ప్రజల మధ్యలోకి వచ్చిన చిరుతపులిపై పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. కాపాడాల్సిన అధికారులే బూటు కాలితో తొక్కి చంపేశారు. దీనికి సంబంధించిన వీడియో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Forest Officers Killed Leopard In UP: మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో అడవుల నుంచి వన్యప్రాణులు ప్రజల మధ్యలోకి వస్తున్నాయి. వాటిని కాపాడి మళ్లీ అటవీ ప్రాంతంలోకి పంపాల్సిన అధికారులు దారుణంగా ప్రవర్తించారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు కలిసి చిరుతపులిని పొట్టన బెట్టుకున్నారు. జాలి లేకుండా బూట్లతో తొక్కి పట్టేయడంతో ఆ పులి ఊపిరాడక చనిపోయింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
Also Read: RX 100 Bike: గుడ్‌న్యూస్.. మళ్లీ రానున్న 'యమహా ఆర్‌ఎక్స్ 100'.. ఫీచర్స్, ధర వివరాలు ఇవే
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని రసూల్‌పూర్ ధాత్రా గ్రామంలోకి ఓ చిరుతపులి వచ్చింది. ఓ ఇంట్లోకి ప్రవేశించడంతో కుటుంబసభ్యులు భయాందోళనతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పులి రావడంతో స్థానికంగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులు, ఇతర అధికార యంత్రాంగం అక్కడకు చేరుకుంది. పదుల సంఖ్యలో అధికారులు అతికష్టంగా పులిని బంధించారు.
Also Read: Friend Fraud: స్నేహితుడి నమ్మకద్రోహం.. ఆపదలో ఉన్నాడని సహాయం చేస్తే ప్రాణమే తీశాడు
రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అనంతరం పులిని బంధించి ఒక చోటకు చేర్చారు. అయినా పులి వెనక్కి తగ్గలేదు. విడిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారిని గాయపర్చింది. ఎదురుదాడి దిగిన పులిపై పోలీసులు విచక్షణా రహితంగా ప్రవర్తించారు. వల వేసి పట్టుకున్నా కూడా అనంతరం బూటు కాళ్లతో తొక్కుతూ నిల్చున్నారు. అలా ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు పది మందికి బూటు కాలుతో నిలవడంతో పులి తప్పించుకోలేకపోయింది.
అయితే బరువు అధికమవడంతోపాటు ఊపిరి ఆడక ఆ పులి మృత్యువాత పడింది. పులి చనిపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ పులిని బంధించే క్రమంలో అధికారులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అరుదైన చిరుతపులిని బంధించి అడవిలో వదిలిపెట్టాలి కానీ ఇలా బూటు కాలితో కర్కశంగా వ్యవహరించడం సరికాదని జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎదురుదాడి చేస్తే దానికి తగ్గ చర్యలు తీసుకోవాలి కానీ ఇలా ప్రవర్తించడం సరికాదని పోలీసుల తీరును తప్పుబడుతున్నారు.
అధికారులు వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పులిని తొక్కుతున్న వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై తీవ్ర దుమారం రేపడంతో అధికారులు విచారణకు ఆదేశించారని సమాచారం. అయితే పోలీసులు అలా ప్రవర్తించడం వెనుక ఒక కారణం ఉందని తెలుస్తోంది. అటవీ శాఖ అధికారుల వద్ద పులిని బంధించే సామగ్రి, పరికరాలు లేవని సమాచారం. ఇంజెక్షన్లు, ఇతర వస్తువులు లేకపోవడంతో అధికారులు అలా ప్రవర్తించారని చర్చ జరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి