Govt Jobs 2023: కేవలం రూ. 4950 ఇస్తే రూ. 29000 జీతం వచ్చే సర్కారు నౌకరి రెడీ.. నిజమేనా ?
Fact Check on Fake Govt Jobs 2023: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ అపాయిట్మెంట్ లెటర్ వివాదంపై పీఐబీ ఫ్యాక్ట్ చేసి నిజం నిగ్గు తేల్చింది. అపాయింట్‌మెంట్ లెటర్‌పై విచారణ జరిపిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం.. ఆ వివరాలను తమ సోషల్ మీడియా ట్విటర్ ఖాతా ద్వారా అందరితో పంచుకుంది.
Fact Check on Fake Govt Jobs 2023: ప్రభుత్వ ఉద్యోగాల కోసం కసరత్తులు చేస్తోన్న యువతను టార్గెట్ చేస్తూ ఎన్నో మోసాలు చోటుచేసుకుంటున్నాయి. నిత్యం ఎన్నో ఘటనలు వెలుగుచూస్తున్నప్పటికీ... ఇప్పటికీ కొంతమంది అమాయక జనం అలాంటి మోసగాళ్ల చేతుల్లో చిక్కుకుని మోసపోతూనే ఉన్నారు. మరోవైపు మోసగాళ్లు సైతం రోజుకొక అవతారం ఎత్తి మరీ అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక అపాయిట్మెంట్ లెటర్ వైరల్ అవుతోంది. ఇలాంటి అపాయిట్మెంట్ లెటర్స్ కొంతమందికి పర్సనల్ గానూ అందుతున్నట్టు తెలుస్తోంది.
అపాయిట్మెంట్ లెటర్ లో పేర్కొన్న అంశాల ప్రకారం ఆత్మనిర్భర్ భారత్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ కింద కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ పోస్టలకు అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని.. ఈ పదవికి దరఖాస్తు చేసుకునే వారు రూ. 4950 చెల్లిస్తే.. వారికి నెలకు రూ. 29,000 జీతం ఇచ్చే ఉద్యోగం సిద్ధంగా ఉందని ఆశ చూపిస్తున్నారు. ఈ విషయం తెలియని కొంతమంది అమాయక జనం.. అపాయిట్మెంట్ లెటర్ లో కోరిన విధంగా డబ్బులు సమర్పించుకుని మోసపోతున్నారు.
PIB ఫాక్ట్ చెక్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ అపాయిట్మెంట్ లెటర్ వివాదంపై పీఐబీ ఫ్యాక్ట్ చేసి నిజం నిగ్గు తేల్చింది. అపాయింట్‌మెంట్ లెటర్‌పై విచారణ జరిపిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం.. ఆ వివరాలను తమ సోషల్ మీడియా ట్విటర్ ఖాతా ద్వారా అందరితో పంచుకుంది. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మోసగాళ్లు పంపిస్తున్న ఈ అపాయింట్‌మెంట్ లెటర్ పూర్తిగా నకిలీదని.. ఇలాంటి వాటికి స్పందించి మోసగాళ్ల చేతుల్లో మోసపోవద్దని నిరుద్యోగులను పీఐబి హెచ్చిరించింది.
ఇది కూడా చదవండి : Old Vehicles Seizing: ఆ నెంబర్ సిరీస్ వాహనం కనిపిస్తే చాలు సీజ్.. ఇప్పటికే 800 వాహనాలు సీజ్
ఇది కూడా చదవండి : Car Insurance Tips: కారు ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా ?
ఇది కూడా చదవండి : Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
యాపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook