Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్

Apple iPhone 13, iPhone 14: 2023 హోలీ పండగ వచ్చేస్తోంది. వస్తూ వస్తూనే డిస్కౌంట్ ఆఫర్స్ రూపంలో సంబరాలు మోసుకొస్తోంది. ఫ్లిప్‌కార్ట్ వారి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ డమాల్ సేల్ 2023 మార్చి 3 నుంచి ప్రారంభం అవుతోంది. అనేక రకాల స్మార్ట్ ఫోన్స్ నుంచి మొదలుకుని స్మార్ట్ ఫోన్స్ యాక్సెసరీస్ వరకు అనేక ఎలక్ట్రానిక్ డివైజెస్ పై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది.

Written by - Pavan | Last Updated : Mar 3, 2023, 04:02 AM IST
Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్

Apple iPhone 13, iPhone 14 Discounted Price : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ డమాల్ సేల్ 2023 లో భాగంగా మార్చి 3 నుంచి మార్చి 5 వ తేదీ వరకు డిస్కౌంట్ సేల్ నడవనుంది. ఇందులో దాదాపు 1000 కి పైగా బ్రాండ్స్‌కి చెందిన దాదాపు లక్షకుపైగా ప్రోడక్ట్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. రియల్లీ ఇట్స్ టెంప్టింగ్ కదూ!! ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ డమాల్ సేల్ 2023 లో ముఖ్యంగా యాపిల్ ఐఫోన్ 13, యాపిల్ ఐపోన్ 14 పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ గురించి తెలిస్తే.. ఐఫోన్ కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వాళ్లంతా టెంప్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

రూ. 69,900 యాపిల్ ఐఫోన్ 13 కేవలం రూ. 36,999 కే. 
యాపిల్ ఐఫోన్ 13 ధర ప్రస్తుతం రూ. 69,900 గా ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ రూ. 7.901 ఆఫర్ అందిస్తోంది. ఈ ఆఫర్ తీసేయగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 రూ 61,999 కే లభిస్తోంది. ఇదే కాకుండా హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ కార్డ్స్ ఉపయోగించడం ద్వారా మరో రూ. 2000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో యాపిల్ ఐఫోన్ 13 ధర రూ. 59,999 కి దిగొస్తుంది. ఇంతటితో ఆఫర్స్ అయిపోలేదు. మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్‌చేంజ్ చేసుకున్నట్టయితే.. బోనస్ కింద మరో రూ. 23,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతే అంతిమంగా యాపిల్ ఐ ఫోన్ మీకు రూ. 36,999 కే లభిస్తుంది. ఇట్స్ రియల్లీ ఏ బిగ్ డీల్ కదా. 

రూ. 80 వేల యాపిల్ ఐఫోన్ 14 ధర కేవలం రూ. 45 వేలకే...
యాపిల్ ఐఫోన్ 14 ధర ప్రస్తుతం రూ. 79,900 గా ఉండగా.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7,901 డిస్కౌంట్ తరువాత రూ.71,999 లకు విక్రయిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ హోలీ బచత్ సేల్‌లో భాగంగా హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ కార్డ్స్‌పై ఈ ఫోన్ కొనుగోలు చేసినట్టయితే అదనంగా మరో రూ. 4000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో యాపిల్ ఐఫోన్ 14 ధర రూ. 67,999 కి తగ్గింది. ఇదేకాకుండా మీ స్మార్ట్‌ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసినట్టయితే.. అదనంగా మరో రూ. 23 వేల వరకు ఆఫర్ లభిస్తుంది. ఇవన్నీ ఆఫర్స్ మీకు వర్తించినట్టయితే.. దాదాపు రూ. 80 వేల ఫోన్ మీకు రూ. 45 వేలకే సొంతం అవుతుందన్నమాట.

Trending News