Funeral Meet Belly Dance: మన జీవితంలో ప్రియమైన వ్యక్తులను కోల్పోవడం బాధకరమైన విషయం. సాధారణంగా భారతదేశంలో హిందూ సంప్రదాయం ప్రకారం.. ఎవరైనా మరణిస్తే, వారి మరణాంతరం ఆత్మకు శాంతి చర్యలను పాటిస్తారు. కొంతమంది సంస్మరణ సభలను ఏర్పాటు చేసి.. మరణించిన వారితో తమకు ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం సహా నివాళులు అర్పిస్తారు. గతించిన వారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా అన్నదానం కూడా చేస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ, ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలో అందుకు విరుద్ధంగా ఉంది. సంస్మరణ సభలో ఏకంగా బెల్లీ డ్యాన్స్ ను ఏర్పాటు చేశారు కొందరు మహానుభావులు. మహేష్ బాబు నటించిన 'పోకిరి' మూవీ హిందీ రీమేక్ 'వాంటెడ్' మూవీలోని ఓ పాటకు ఓ నృత్యకారిణి బెల్లీ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఏముందో మీరే చూసేయండి. 


బెల్లీ డ్యాన్స్ తో నివాళా?



సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో ప్రకారం.. ఒక వృద్ధుడు, మరో వృద్ధురాలు చిత్రాలతో సంస్మరణ సభను పోలిఉంది. వారి మృతి అనంతరం ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో బెల్లీ డ్యాన్స్ ను బంధువులు ఆస్వాదిస్తున్నారు. ఇదేం సంప్రదాయం అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే ఓ సంస్మరణ సభలో సల్మాన్ ఖాన్ నటించిన 'వాంటెడ్' మూవీలోని పాపులర్ సాంగ్ 'లే లే మజా లే'పై ఓ యువతి బెల్లీ డ్యాన్స్ చేస్తోంది. ఆమె డ్యాన్స్ ను కెమెరాలో షూట్ కూడా చేస్తున్నారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


దీనిపై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నివాళులు అర్పించాల్సిన సభలో ఇలాంటి అసభ్యకరమైన డ్యాన్స్ లు ఏంటని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 వేల మంది ఈ వీడియోను లైక్ చేయగా, లక్షల్లో వ్యూస్ వచ్చాయి. 


Also Read: Mobile Theft Video: బాప్ రే! ఎంత తెలివిగా మొబైల్ దొంగతనం చేసిందో మీరే చూడండి!


Also Read: Viral Video: కారు నడుపుతుండగా స్పృహ కోల్పోయిన మహిళ.. తర్వాత ఏమైందంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.