Viral Video: కారు నడుపుతుండగా స్పృహ కోల్పోయిన మహిళ.. తర్వాత ఏమైందంటే?

Viral Video: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ షాకింగ్ వీడియో వైరల్ గా మారింది. డ్రైవింగ్ చేస్తుండగా.. ఓ మహిళ స్పృహ తప్పింది. దీంతో ఆమెను కాపాడేందుకు చుట్టుపక్కల వారు తీవ్రంగా శ్రమించారు. అందుకు సంబంధించిన వీడియోలో ఏం జరిగిందో మీరే చూసేయండి.   

Last Updated : May 13, 2022, 11:54 AM IST
Viral Video: కారు నడుపుతుండగా స్పృహ కోల్పోయిన మహిళ.. తర్వాత ఏమైందంటే?

Viral Video: రోడ్లపై నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో మన చుట్టుప్కల వారు చాలా మంది సహాయం చేసేందుకు ముందుకు రాకపోవచ్చు. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ వీడియోలో మాత్రం డ్రైవింగ్ చేస్తూ.. స్పృహ తప్పిన మహిళ కోసం చాలా మంది వచ్చారు. అదుపుతప్పిన కారును రోడ్డుపై నిలిపేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అదేంటో మీరే చూడండి. 

డ్రైవింగ్ చేస్తూ స్పృహ తప్పిన మహిళ..

ట్రాఫిక్ సిగ్నల్ పడిన తర్వాత కూడా కారు నెమ్మదిగా కదులుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే ఆ కారు ఎటువైపు వెళ్తుందోనని జనాలు ఆశ్చర్యపోతున్నారు. అయితే కారు నడుపుతున్న మహిళ స్పృహ తప్పడం వల్లే కారు అదుపుతప్పుతోందని చుట్టుపక్కల వారు గమనించారు. ఆ తర్వాత వెంటనే ఆ కారును ఆపేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. అదృష్టవశాత్తూ ఆ కారుకు ఎలాంటి ప్రమాదం జరగకుండా స్థానికులు కాపాడారు. 

ఏం జరిగిందంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు నడుపుతున్న మహిళ స్పృహతప్పి పడిపోవడాన్ని రోడ్డుపై ఉన్న వ్యక్తులు గమనించారు. అంతలోనే ఆమె నడుపుతున్న కారు కదులుతున్నట్లు గమనించిన ఇతర వాహనదారులు ముందుకొచ్చారు. అదుపుతప్పిన కారును ఆపడం సహా కారు విండో గ్లాస్ ను పగులకొట్టి.. ఆ తర్వాత ఆమెను కాపాడారు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించారు.  

Also Read: Viral Video: వెడ్డింగ్ రిసెప్షన్‌లో 'ఫైర్ స్టంట్'... వీపుకి నిప్పంటించుకున్న కొత్త జంట... షాకైన అతిథులు...

Also Read: Perk Ad Video: అలియా భట్ తో పారాగ్లైడింగ్.. భయంతో కేకలు పెట్టిన యువకుడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News